‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!
ABN, Publish Date - Apr 30 , 2026 | 07:38 PM
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న హీరోయిన్ ఇంట త్వరలో చిన్నారి పాదాల సవ్వడి వినిపించబోతోంది. తను గర్భవతి అనే విషయాన్ని ఎంతో భావోద్వేగంగా, మరెంతో అందంగా తన అభిమానులతో ఈ హీరోయిన్ పంచుకున్నారు.
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John) ఇంట త్వరలో చిన్నారి పాదాల సవ్వడి వినిపించబోతోంది. తను గర్భవతి అనే విషయాన్ని ఎంతో భావోద్వేగంగా, మరెంతో అందంగా తన అభిమానులతో పంచుకున్నారు రెబా. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌కు హీరోయిన్స్ రియాక్ట్ అవుతూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రెబా మోనికా జాన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘ముగ్గురిగా ఎదుగుతున్నాము.. హల్లెలూయ’ అంటూ పోస్ట్ చేశారు. దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన కానుకకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయంలో అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని ఆమె కోరుకున్నారు. ‘‘ఈ బిడ్డను దేవుడు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాము. జీవితంలో అత్యంత కీలకమైన ఈ ‘స్పెషల్ జర్నీ’కి అందరి దీవెనలు కావాలి. ఈ కొత్త ఆరంభం పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను’’ అని రెబా తన పోస్ట్‌లో తెలిపారు. అంతే కాదు, తన భర్త జోమోన్ జోసెఫ్‌తో ఈ అందమైన క్షణాలను ఎలా షేర్ చేసుకుందో కూడా తెలిపేలా ఆమె ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె వైవాహిక జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నారనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. వర్ష బొల్లమ్మ, అపర్ణా బాలమురళీ, గాయిత్రీ రెడ్డి, దివ్య, ప్రియాంకా జవాల్కర్ వంటి వారంతా రెబా పోస్ట్‌కు రియాక్ట్ అవుతూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. చాలా సంతోషంగా ఉందని తెలుపుతున్నారు. రెబా మోనికా జాన్ విషయానికి వస్తే.. ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘సామజవరగమన’, ‘మృత్యుంజయ్’ సినిమాలలో శ్రీ విష్ణు (Sree Vishnu) సరసన ఆమె నటించారు. విజయ్ ‘బిగిల్’ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.
ఇవి కూడా చదవండి:
ప్రేమలో పూజా హెగ్డే.. కుర్రాడు కత్తిలా ఉన్నాడుగా!
‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?