K.S. Ramarao: మేడేన ‘రాక్షస పురం’

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:55 PM

కన్నడ నుండి తెలుగులో డబ్‌ అవుతున్న 'రాక్షస పురం' సినిమాను మే1 విడుదల చేస్తున్నట్టు కె.ఎస్. రామారావు తెలిపారు. ఈ సినిమాలో హీరో రాజ్‌ బి శెట్టి పోలీస్‌ ఇన్ స్పెక్టర్ పాత్రను చేశారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో ఘనవిజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె. ఎస్. రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డాక్టర్ రవి దర్శకత్వంలో రాజ్ బి శెట్టి హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షస పురం’ పేరుతో మే 1న విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ​ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, 'ఇది ఒక అద్భుతమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కన్నడ వెర్షన్ చూసిన తర్వాత సినిమాలోని మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాను. సినిమాలో రాజ్ బి శెట్టి ఇన్ స్పెక్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు' అని తెలిపారు.


మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో మే1వ తేదీ ఈ సినిమాను విడుదల చేస్తున్నామని కె.ఎస్. రామారావు చెప్పారు. ప్రస్తుతం ఐపీఎల్‌ సందడి ఎక్కువగా ఉందని, అందుకే తమ చిత్రాన్ని వీలైనంత వరకూ మార్నింగ్‌, మ్యాట్నీ షోస్‌ వేయలని డిస్ట్రిబ్యూటర్స్ ను కోరామని కె.ఎస్. రామారావు తెలిపారు. త్వరలోనే మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తామని అన్నారు. ప్రస్తుతం సినిమా రంగం కష్టకాలంలో ఉందని, ఐపీఎల్‌తో పాటు ఓటీటీల మధ్య పోటీ వల్ల థియేటర్లకు జనం రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో కూడా కంటెంట్‌ బేస్డ్ గా తీసిన 'రాక్షస పురం'ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మరో నిర్మాత తుమ్మల రామసత్యనారాయణ కూడా పాల్గొన్నారు. కేఎస్ రామారావు గారి అభిరుచి, అనుభవం ఈ సినిమా విజయానికి తోడ్పడుతుందని ఆయన ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

Updated Date - Apr 21 , 2026 | 01:58 PM