సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అందులో... ఇందులో మోహన్‌ లాలే!

ABN, Publish Date - Apr 21 , 2026 | 12:50 PM

టాలీవుడ్ స్టార్ హీరోస్ తో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మంచి అనుబంధం ఉంది... అందువల్లే ఆయన ఇద్దరు టాప్ తెలుగు స్టార్స్ మూవీస్ లో కీలక పాత్రలు పోషించనున్నారని టాక్! ఇంతకూ ఆ సినిమాలేంటో!?

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగునేలపైనా మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో మోహన్ లాల్ కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించారు. ఇప్పుడు మరోమారు మోహన్ లాల్ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారని విశేషంగా వినిపిస్తోంది. ఆ రెండు చిత్రాలు తెలుగునాట టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) సినిమాలు కావడం విశేషం. చిరంజీవి హీరోగా బాబీ రూపొందించబోయే సినిమాలో మోహన్ లాల్ ఓ కీ రోల్ లో కనిపించనున్నారట. అలాగే బాలకృష్ణ కథానాయకునిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలోనూ మోహన్ లాల్ నటిస్తున్నారని విశేషంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే ఒకేసారి ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ లో నటించిన ఏకైక మళయాళ స్టార్ గా మోహన్ లాల్ వెలుగొందుతారు.


మోహన్ లాల్ కు తెలుగు స్టార్స్ తో ఎంతో అనుబంధం ఉంది. దాదాపు 32 ఏళ్ళ క్రితమే మోహన్ లాల్ తెలుగు చిత్రంలో కనిపించారు. 1994లో బాలకృష్ణ హీరోగా ప్రియదర్శన్ డైరెక్షన్ లో రూపొందిన 'గాండీవం' తెలుగు సినిమాలో తొలిసారి మోహన్ లాల్ ఓ పాటలో తళుక్కుమన్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా 'గాండీవం'లో మోహన్ లాల్ కనిపించిన సాంగ్ ఈ నాటికీ ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంటుంది. ఆ తరువాత మోహన్ లాల్ హీరోగా తెలుగులో 'మనమంతా' చిత్రం రూపొందింది. అదే 2016లో జూనియర్ యన్టీఆర్ (Jr NTR) హీరోగా తెరకెక్కిన 'జనతా గ్యారేజ్'లోనూ మోహన్ లాల్ కీలక పాత్ర ధరించారు. గత సంవత్సరం 'కన్నప్ప' సినిమాలో కిరాతుని పాత్రలోనూ కనిపించి ఆకట్టుకున్నారు మోహన్ లాల్. ఇలా తెలుగువారితో అనుబంధం ఉన్న మోహన్ లాల్ ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి లాంటి టాప్ స్టార్స్ చిత్రాల్లో నటించడం విశేషంగా మారింది.


చిరంజీవి- బాబీ సినిమాలో మోహన్ లాల్ నటిస్తున్నారని చాలా రోజుల క్రితమే వినిపించింది. అయితే ఆ చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ నిర్మించిన కొన్ని సినిమాలు ఇంకా విడుదలకు నోచుకోలేదు. వందలాది కోట్ల రూపాయలు బ్లాక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిరు-బాబీ కాంబో మూవీ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కనిపించడం లేదు. అందువల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అయితే ఆ సినిమాలో మోహన్ లాల్ నటించడం అనుమానమే అంటున్నారు కొందరు. ఇక బాలయ్య, వివేక్ ఆత్రేయ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపిస్తారా? లేక కేమియో రోల్ లో అలరిస్తారా? అన్న అనుమానాలూ ఉన్నాయి. ఏది ఏమైనా మోహన్ లాల్ లాంటి మళయాళ స్టార్ హీరో మన తెలుగు టాప్ స్టార్స్ తో జోడీ కట్టడం విశేషమే. ఆ విశేషాన్ని మేకర్స్ ఎలా నిలుపుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

Updated Date - Apr 21 , 2026 | 01:02 PM