మోహన్‌ లాల్‌ కెరీర్‌లో మైలురాయి 'దృశ్యం 3'

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:01 PM

మోహన్ లాల్, మీనా జంటగా వచ్చిన 'దృశ్యం 3' సినిమా రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. మోహన్‌ లాల్ సినిమాల్లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన మూడో చిత్రంగా 'దృశ్యం 3' నిలిచింది.

Dhrishyam 3 Movie

సీనియర్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం 3' విడుదలైనప్పుడు ఆ సినిమాకు అంత దృశ్యం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే చిత్రంగా విమర్శకుల నోళ్ళు మూతపడేట్టుగా ఈ సినిమా ఏకంగా 200 కోట్లకు పైగానే గ్రాస్ ను వసూలు చేసి, తన సత్తాను చాటుకుంది. మోహన్‌ లాల్‌, మీనా జంటగా నటించిన ఈ తాజా చిత్రాన్ని గత మూడు చిత్రాలతో పోల్చుతూ విమర్శకులు పెదవి విరిచారు. చివరి అరగంట సినిమా బాగున్నా... ముందంతా సినిమా సదాసీదాగా సాగిపోయిందని అన్నారు. అయితే నవ్విన నాప చేసే పండిన చందాన 'దృశ్యం 3' తెలుగులోనూ పది కోట్లకు పైగా గ్రాస్‌ను వసులూ చేసింది. భారత్ లో ఈ సినిమా 128.15 కోట్లు, విదేశాలలో రూ. 109.55 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


'దృశ్యం 3' మోహన్ లాల్‌ కెరీర్‌లో రెండు వందల కోట్లు వసూలు చేసిన మూడో సినిమా కాగా, ఆయన కెరీర్ లో సెకండ్‌ హయ్యెస్ మూవీ కూడా ఇదే. అలానే 2026లో మాలయాళ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు... విదేశాలలోనూ నాలుగో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన మలయాళ చిత్రంగా 'దృశ్యం 3' నిలిచిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. మొత్తం మీద 'దృశ్యం 3' సాధించిన విజయంతో దీనికి మరో సీక్వెల్ ను రూపొందించడానికి దర్శకుడు జీతూ జోసఫ్‌ సిద్థమైపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Dhanush: ‘డి-56’ ఆ రోజే అఫీషియల్

Mysskin: విజయ్‌ సేతుపతి ఒక అగ్నిపర్వతం 

Shruti Haasan : శ్రుతి హాసన్ ఓ ఇంటిదయ్యింది

Updated Date - Jul 14 , 2026 | 01:04 PM