సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bethlehem Kudumba Unit: 'జన నాయగన్‌' వెనక్కి...

ABN, Publish Date - Sep 22 , 2026 | 04:25 PM

ఈ యేడాది దక్షిణాదిన అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా 'బెత్లెహెం కుటుంబ యూనిట్‌' నిలువబోతోంది. ఇప్పటికే 'జననాయగన్‌'ను దాటేస్తున్న ఈ సినిమా 'పెద్ది'ని క్రాస్‌ చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

bethlehem kutumba unit

చిన్న సినిమాతో జనాలు కనెక్ట్ అయితే... వాటి కలెక్షన్స్ సునామీని తలపిస్తాయి. ఆ మధ్య మలయాళ చిత్రం 'లోక' బాక్సాఫీస్ బరిలో అలాంటి సునామీనే సృష్టించింది. ఎవరూ ఊహించనవి విధంగా 300 కోట్లకు పైగా గ్రాస్ ను ఆ సినిమా వసూలు చేసింది. కళ్యాణీ ప్రియదర్శిని నటించిన ఆ సినిమా విడుదలైనప్పుడు ఎవ్వరూ ఆ స్థాయి విజయాన్ని అస్సలు ఊహించలేదు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తే 'లోక' బ్లాక్‌ బస్టర్ గా సాగింది.


ఈ యేడాది దక్షిణాది చిత్రాలలో ఇంతవరకూ అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన సినిమాగా రామ్ చరణ్‌ 'పెద్ది' 334.20 కోట్లు వసూలు చేసి నిలిచింది. ఆ తర్వాత స్థానం ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నటించిన చివరి చిత్రం 'జననాయగన్‌'ది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా... 323.95 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. చిత్రం ఏమంటే... ఈ ఇద్దరితో పోల్చితే ఎలాంటి ఇమేజ్ లేని మలయాళ నటుడు నివిన్ పౌలీ నటించిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్‌' మూవీ ఏకంగా రూ. 323 కోట్లను కేవలం 32 రోజుల్లో వసులూ చేసింది. అంతే ఒకటి రెండు రోజుల్లో ఈ సినిమా 'జన నాయగన్' కలెక్షన్స్ ను దాటేస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు ఇక నెక్ట్స్ టార్గెట్ 'పెద్ది' సినిమానే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'బెత్లెహెం కుటుంబ యూనిట్‌' వివిధ భాషల్లోకి అనువాదమై అక్కడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుతోంది. దాంతో ఖచ్చితంగా ఇది కాస్త అటూ ఇటూగా 350 కోట్ల గ్రాస్ వసులు చేస్తుందనే తెలుస్తోంది. అదే జరిగితే.. ఈ యేడాది ఇప్పటి వరకూ దక్షిణాదిన ఈ ఫీట్ ను సాధించిన తొలి చిత్రంగా 'బెత్లెహెం కుటుంబ యూనిట్‌' నిలుస్తుంది. అలానే కేవలం కేరళలోనే ఈ సినిమా రూ. 150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.


విశేషం ఏమంటే... 'జన నాయగన్', 'పెద్ది' చిత్రాల బడ్జెట్ తో పోల్చితే 'బెత్లెహెం కుటుంబ యూనిట్‌' చాలా తక్కువలో నిర్మించినట్టే. అయితే హృదయానికి హత్తుకునేలా ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమాను దర్శకుడు తెరకెక్కించడంతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులూ ఈ మూవీతో కనెక్ట్ అయ్యారు. పైగా 'ప్రేమలు'కు ఇది సీక్వెల్ గా ఉందంటూ కామెంట్స్ రావడం, ఈ రెండు సినిమాలను గిరీషే తెరకెక్కించడం... ఇందులోనూ మమితా బైజూనే హీరోయిన్‌ కావడం బాగా కలిసొచ్చింది.

ఇవి కూడా చదవండి:

సినీ ప్రయాణంలో 48 వసంతాలు.. మెగాస్టార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Nidhhi Agerwal: మంచి క‌థ, పాత్ర‌ల‌కు.. త‌మిళ సినీ రంగ‌మే ఉత్త‌మం

The Paradise: జ‌డ‌ల్‌.. సెన్సార్ క‌త్తెర‌కు బాగానే ప‌ని చెప్పాడుగా


Updated Date - Sep 22 , 2026 | 04:44 PM