Sardar 2: కమల్‌కు భారతీయుడు.. కార్తీకి సర్దార్‌!

ABN , Publish Date - Sep 08 , 2026 | 09:25 AM

కమల్‌హాసన్‌ సినీ జీవితానికి ‘భారతీయుడు’  ఎలాగో.. తనకు  ‘సర్దార్‌’ సినిమా అలా.  నా కెరీర్ కు సర్దార్ -2 సినిమా ఎంతో ముఖ్యం' అని హీరో కార్తీ అన్నారు. 

కమల్‌హాసన్‌ సినీ జీవితానికి ‘భారతీయుడు’  ఎలాగో.. తనకు  ‘సర్దార్‌’ సినిమా అలా.  నా కెరీర్ కు సర్దార్ -2(Sardar 2) సినిమా ఎంతో ముఖ్యం' అని హీరో కార్తీ అన్నారు. పీఎస్‌ మిత్రన్‌ (PS mithran)దర్శకత్వంలో విజయవంతమైన ‘సర్దార్‌’ చిత్రానికి కొనసాగింపుగా ‘సర్దార్‌ 2’ వస్తోంది. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్‌ కథానాయికలు. ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ నెల 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా  సోమవారం హైదరాబాద్‌లో ‘సర్దార్‌ 2’ ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. అడివి శేష్, బోయపాటి శ్రీను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్తి మాట్లాడుతూ ‘‘సర్దార్‌’ లాంటి ఓ స్పై పాత్ర దొరకడం నా అదృష్టం. తొలి పార్ట్‌ చేసినప్పుడే నాకు ఓ మంచి ఫీలింగ్‌ వచ్చింది. ఇలాంటి గూఢచారులకు ఎలాంటి గుర్తింపు, గౌరవం ఉండదు. కానీ, వాళ్లు తమ పనిని ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తారు. ‘సర్దార్‌ 2’లో విమెన్ పవర్ చూస్తారు. హీరోయిన్లు ఇద్దరూ యాక్షన్‌ సన్నివేశాలు ఇరగదీసారు’ అని తెలిపారు.

‘ప్రస్తుతం తెలుగు  ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సినిమా విజయవంతమవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇలాంటి సమయంలో వస్తోన్న ‘సర్దార్‌ 2’ అదే మాదిరి అద్భుతమైన హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు బోయపాటి శ్రీను. 

 

ALSO READ:

బాలయ్యకి విలన్లుగా మారుతున్న కుర్ర హీరోలు..

సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన రవి మోహన్- కేనీషా

Updated Date - Sep 08 , 2026 | 10:41 AM