సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన రవి మోహన్- కేనీషా

ABN , Publish Date - Sep 07 , 2026 | 09:51 PM

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడురవి మోహన్. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన, గత కొన్ని నెలలుగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే.

Ravi mohan

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడురవి మోహన్ (Ravi Mohan). తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన, గత కొన్ని నెలలుగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. ఆయన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఆర్తి తన భార్యాభర్తల బంధం దెబ్బతినడానికి, విడాకుల నిర్ణయానికి గాయని, గోవాకి చెందిన కేనిషా ఫ్రాన్సిస్‌తో రవికి ఉన్న సాన్నిహిత్యమే కారణమని ఆరోపించడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారింది. గతంలో గోవాతో పాటు ప్రైవేట్ ఈవెంట్లలో వీరిద్దరూ కలసి కనిపించడంతో కేనిషా పేరు నెట్టింట విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.


అయితే, విడాకుల వివాదం తీవ్రరూపం దాల్చిన తర్వాత జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో రవి మోహన్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నాడు. భార్య ఆర్తి చేసిన ఆరోపణల వల్ల కేనిషా తీవ్ర మనస్తాపానికి గురై తన నుంచి విడిపోయిందని, వెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కేనిషా కేవలం తన స్నేహితురాలు ,హీలర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశాడు. దీంతో రవి మోహన్ భార్య ఆర్తిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆమె నరకయాతన చూపించడంతో పాటు పిల్లలను తన వద్దకు పంపించడం లేదని చెప్పడంతో చాలామంది ఆర్తి తప్పే అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక ఈ మానసిక ఒత్తిడితో తాను సినిమాలు కూడా చేయలేకపోతున్నట్లు తెలిపాడు.


ఇక తాజాగా సోషల్ మీడియాలో రవి మోహన్, కేనిషా ఫ్రాన్సిస్ ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్న ఓ వీడియో క్లిప్ లీక్ అయి విపరీతంగా వైరల్ కావడంతో మళ్లీ ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో అసలు ఎప్పటిది? ఇది నిజమైన వీడియోనా లేదా ఇటీవల ఏఐ సాంకేతికతతో క్రియేట్ చేసిన ఫేక్ విజువలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనను వదిలి వెళ్ళిపోయింది అన్న కేనీషా మళ్లీ ఎలా రవి లైఫ్ లోకి వచ్చింది. ఈ వీడియో ఈ మధ్యనే తీసినట్లు ఉంది. అంటే అప్పుడు ప్రెస్ మీట్ లో రవి చెప్పినవన్నీ అబద్దాలేనా.. కావాలనే ఆర్తిని తప్పు పట్టేలా చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రస్తుతం రవి మోహన్ స్వయంగా నిర్మిస్తున్న ఆర్డినరీ మ్యాన్ చిత్రానికి కేనిషా ఫ్రాన్సిస్ సంగీత దర్శకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వీడియోపై రవి మోహన్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Updated Date - Sep 07 , 2026 | 09:51 PM