బాలయ్యకి విలన్లుగా మారుతున్న కుర్ర హీరోలు..
ABN , Publish Date - Sep 07 , 2026 | 10:02 PM
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్న ఆయన, ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో దాదా సినిమా చేస్తూ బిజీగా మారారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్న ఆయన, ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో దాదా సినిమా చేస్తూ బిజీగా మారారు. ఇక ఈ సినిమా తరువాత దేవర ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మరో హై-బడ్జెట్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. వీరసింహారెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ మధ్య బాలకృష్ణ చిత్రాల్లో విలన్ల ఎంపిక సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, గతంలో వరుస సినిమాలతో అలరించి, ఆ తర్వాత విలక్షణమైన పాత్రల వైపు అడుగులు వేశారు. మిరాయ్ సినిమా విజయంతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మనోజ్.. దాదా సినిమాలో ఒక అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ విలన్ పాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య - మనోజ్ మధ్య యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని టాక్ నడుస్తోంది.
మంచు మనోజ్ కాకుండా మరో కుర్ర హీరో కూడా బాలయ్యతో ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కోసం తమిళ నటుడు, హీరో ఆర్యని సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ వరుడు, వెంకటేష్ సైంధవ్ వంటి సినిమాల్లో పవర్‌ఫుల్ విలన్‌గా అలరించిన ఆర్యకు టాలీవుడ్‌లో విలనిజం పండించడం కొత్తేమీ కాదు.ఇక ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఆర్యను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య కూడా యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని టాక్. ఇలా ఒకవైపు మంచు మనోజ్, మరోవైపు ఆర్య వంటి యంగ్ హీరోలు బాలయ్యకు విలన్లుగా మారడంతో ఈ సినిమాలపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. మరి ఈ సినిమాలతో బాలయ్య ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.