సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హాలీవుడ్ లెవెల్ యాక్షన్‌తో ‘మార్షల్’!

ABN, Publish Date - Mar 20 , 2026 | 06:43 PM

కోలీవుడ్ హీరో కార్తీకి కొత్త హిట్ ఫార్ములా దొరికింది. సేమ్ ఫార్ములాలో ఆల్రెడీ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్నా, కొత్త మూవీని కూడా అదే జానర్‌లో తీసుకొస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్ హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా 'సర్దార్'. గూఢచారి నేపథ్యంలో సాగిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా... కార్తీ నటనకు కొత్త డైమెన్షన్ ఇచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'సర్దార్ 2' తెరకెక్కుతోంది. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ జాప్యం వల్ల దీని విడుదల ఆలస్యమవుతోంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, కార్తీ అప్ కమింగ్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.


కార్తీ తాజాగా 'మార్షల్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా స్పై థ్రిల్లర్ జోనర్‌లోనే ఉందని.. 'సర్దార్'ను మించే ట్విస్టులతో, యాక్షన్‌తో ఉండబోతోందని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. 'మార్షల్'లో కార్తీ పాత్ర గూఢచర్యం నేపథ్యంలోనే సాగుతుందట. కానీ ఇందులో మార్షల్ ఆర్ట్స్, హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని కొందరు చెబుతున్నారు. దేశ రక్షణ కోసం సరిహద్దులు దాటి వెళ్లే రహస్య సైనికుడి ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ అంశాలను దర్శకుడు తమిళ్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ప్రెజెంట్ చేస్తున్నారట.

'సర్దార్'లో వాటర్ మాఫియా చుట్టూ కథ తిరుగుతుంది. అదే 'మార్షల్‌'లో అంతర్జాతీయ స్థాయి భారీ కుట్రను ఛేదించే హీరోగా కార్తీ కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో ఊహించని మలుపులు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కార్తీ ఈ సినిమా కోసం అద్భుతమైన మేకోవర్‌తో పాటు కఠోర శ్రమ తీసుకుంటున్నాడట. విదేశీ స్టంట్ మాస్టర్స్‌ గైడెన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందాడట. సంతోష్ నారాయణన్ ఇస్తున్న సంగీతం ఈ థ్రిల్లర్‌కు మరో స్థాయిలో కూర్చోబెడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా కాన్సెప్ట్, మేకింగ్, యాక్షన్ పరంగా కార్తీ కెరీర్‌లోనే స్పెషల్ చిత్రంగా 'మార్షల్' నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్, టీజర్‌తో ఇంకొన్ని వివరాలు తెలిసే ఆస్కారం ఉంది.

Read Also: ఈ సారి వాయిదా పడితే రిలీజ్‌ అప్పుడే..

Read Also: తొలిసారి జత కడుతున్న విజయ్ సేతుపతి, సాయిపల్లవి!

Updated Date - Mar 20 , 2026 | 06:43 PM