ఈ సారి వాయిదా పడితే రిలీజ్‌ అప్పుడే..

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:38 PM

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) విడుదల మరోసారి వాయిదా పడనుందనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) విడుదల మరోసారి వాయిదా పడనుందనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకుడు. వృద్ది సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల ఓసారి వాయిదా పడింది. మొదట మార్చి 26న విడుదల చేయాలనుకున్నారు కానీ.. కొంత షూటింగ్‌ బాకీ ఉండటం, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పెండింగ్‌ ఉండటంతో ఈ సినిమాను ఏప్రిల్‌ 30కి వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం.. కీలక సన్నివేశాల చిత్రీకరణ, సీజీ వర్క్‌, నేపథ్య సంగీతం వంటి పనులకు ఇంకాస్త సమయం అవసరం కావడంతో ఈ డేట్‌కి కూడా సినిమా రావడం కష్టమే అనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు రాత్రింబవళ్లు ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. క్షణం తీరిక లేకుండా పగలు షూటింగ్‌ చేసి, రాత్రి సమయంలో ఎడిటింగ్‌ వర్క్‌ చేయిస్తున్నారు. ఈ సారి వాయిదా పడితే జూన్‌ చివరి వారంలో విడుదలకు ప్లాన్‌ చేస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక రామ్‌చరణ్‌ పుట్టినరోజుకు ఫ్రెష్‌ ప్రమోషనల్‌ కంటెంట్‌తో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్‌ విజేత ఎ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన చికిరి, రయ్‌ రయ్‌ రారా సాంగ్స్‌ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించాయి.

Updated Date - Mar 20 , 2026 | 04:44 PM