సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Toxic: తెలంగాణాలో 'టాక్సిక్' టిక్కెట్ రేట్ల పెంపు!

ABN, Publish Date - Aug 25 , 2026 | 02:40 PM

యశ్ మూవీ టాక్సిక్ టిక్కెట్ రేట్లను తెలంగాణలో పెంచారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవోను ఆధారంగా చేసుకుని ఈ టిక్కెట్ రేట్ల పెంపు జరిగింది.

Tpxic Movie

యశ్‌ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 25వ తేదీ జనం ముందుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఆన్ లైన్ టిక్కెట్ రేట్లు తెలంగాణాలో మొదలైపోయాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ రేట్లకు సంబంధించి ఓ జీవోను విడుదల చేసింది. అందులో పేర్కొన్నట్టుగా వంద కోట్ల బడ్జెట్ ను మించిన సినిమాలు టిక్కెట్ రేట్లను పెంచుకోవచ్చు. అయితే అందుకు గానూ సదరు నిర్మాణ సంస్థ సినీ కార్మికుల సంక్షేమ నిధికి కోటి రూపాయల విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు టాక్సిక్ నిర్మాత కె. వెంకట నారాయణ అంగీకరించడంతో ప్రభుత్వం టిక్కెట్ రేట్ల పెంపుకు అంగీకరిస్తూ, జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సింగిల్‌ స్క్రీన్స్ లో ధరలను రూ. 50, మల్టీప్లెక్స్ / స్పెషల్ థియేటర్లలో రూ. 100 పెంచుకునే ఆస్కారం ఏర్పడింది. ఈ టిక్కెట్ రేట్ల పెంపును పది రోజుల వరకూ అంటే సెప్టెంబర్ 4 వరకూ రోజుకు ఐదు ఆటల చొప్పున ఉపయోగించుకోవచ్చు.


'టాక్సిక్' చిత్రాన్ని తెలంగాణలో ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు, ఎఫ్‌.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వంతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇక్కడ టిక్కెట్ రేట్ల పెంపుకు మార్గం సుగమం అయ్యింది. కానీ ఇప్పటికీ ఏపీలో 'టాక్సిక్' టిక్కెట్ రేట్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రేపు సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ లో టిక్కెట్ రేట్ల పెంపుకు సంబంధించిన వార్త వచ్చే ఆస్కారం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి:

Arjun Das: దర్శకుడు ఏ మాత్రం తగ్గలేదు..

ఇరుముడి మణమ్మ జీవితంలో ఇంత విషాదమా.. కన్నీళ్లు వచ్చేస్తాయి

రష్మిక తల్లి కాబోతుందా...

Updated Date - Aug 25 , 2026 | 02:41 PM