418 Movie: ప్రశాంత్ నీల్ సినిమా విడుదల వాయిదా!
ABN, Publish Date - Jul 28 , 2026 | 03:03 PM
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కన్నడలో నిర్మించిన హారర్ థ్రిల్లర్ మూవీ '418' విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక హారర్ థ్రిల్లర్ '418'. ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నామని చిత్ర బృందం కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. దానికి తగ్గట్టుగా మూడు రోజుల క్రితం ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అనూహ్యంగా ట్రైలర్ విడుదల వాయిదా పడింది. ఇప్పుడు సినిమా సైతం ఈ నెల 31న విడుదల కావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న '418', హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా సరికొత్త హారర్ అనుభూతిని అందించబోతోందని మేకర్స్ గతంలోనే హామీ ఇచ్చారు. ఈ చిత్రానికి దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా, వెంకీ జీజీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ఉల్లాస్ హైడూర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
హీరో రవి మోహన్‌కు ఊరట.. నెలకు రూ.40 లక్షల భరణం డిమాండ్ తిరస్కరణ
బాక్సాఫీస్ బరిలో.. రెండు కుటుంబాలు.. నలుగురు హీరోలు! విజయం.. ఎవరికి దక్కేనో
ఎన్టీఆర్ భుజానికి గాయం... ఎనిమిది వారాల విశ్రాంతి!