Shruti Haasan: బంధం ఎలా ఉండబోతుందో తెలిస్తే..

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:57 PM

అగ్ర కథానాయిక శ్రుతీహాసన్(Shruti Haasan), దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో (lokesh Kanakaraj) కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌లో కలిసి నటించారు. ఈ ఆల్బమ్‌కు ‘ఇనిమేల్‌’ (Inimel song) అనే టైటిల్‌ పెట్టారు. దీనికి కమల్‌హాసన్‌ లిరిక్స్‌ అందించారు.

Shruti Haasan:  బంధం ఎలా ఉండబోతుందో తెలిస్తే..

అగ్ర కథానాయిక శ్రుతీహాసన్(Shruti Haasan), దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో (lokesh Kanakaraj) కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌లో కలిసి నటించారు. ఈ ఆల్బమ్‌కు ‘ఇనిమేల్‌’ (Inimel song) అనే టైటిల్‌ పెట్టారు. దీనికి కమల్‌హాసన్‌ లిరిక్స్‌ అందించారు. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ పాటకు సంబంధించిన ఆసక్తికర విషయాలు శృతిహాసన్‌ చెప్పారు.  ‘‘లోకేశ్‌ కనగరాజ్‌ అందరికీ దర్శకుడిగానే తెలుసు. సూపర్‌హిట్‌ చిత్రాలు అందించి దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఈ పాటతో తనలో నటుడిని పరిచయం చేస్తున్నారు. ప్రేమనేది ఒక  భ్రమని నా నమ్మకం. ప్రేమలో ఉన్న ఇద్దరి బంధాన్ని నాలుగు నిమిషాల్లో చూపించాలనుకున్నా.  భవిష్యత్తులో ఒక బంధం ఎలా ఉండబోతుందో ముందే తెలిస్తే మీరు అందులో ఉంటారా? లేదా? అన్న ప్రశ్నను పాట రూపంలో మీ ముందుకు వస్తోంది. వేరువేరు ప్రదేశాల్లో మూడు రోజులు షూటింగ్‌ చేశాం. ఈ పాట కోసం నాన్నతో కలిసి వర్క్‌ చేశాను. మరోసారి ఈ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాన్న గొప్ప రచయిత, నటుడు. ఆయన తన పనిలో ఎంత బిజీగా ఉన్నా ఫోన్‌ చేసి ప్రతీ విషయం తెలుసుకునేవారు. ఆయనలా నేను కష్టపడి పని చేస్తాను. ఒకరిపై ఆధారపడను. గత ఏడాది వచ్చిన విజయాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నా’ అని అన్నారు. ప్రస్తుతం శృతిహాసన్‌ అడవి శేష్‌ సరసన ‘డకాయిట్‌’లో నటిస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా పాన్‌ ఇండియా స్థ్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. షానిల్‌ డియో దర్శకుడు.

Updated Date - Mar 25 , 2024 | 07:58 PM