Jana Nayagan: ‘జననాయగన్’ లీక్.. అసలు దొంగ దొరికేశాడు.. ఎవరంటే?
ABN , Publish Date - Apr 16 , 2026 | 08:19 PM
‘జన నాయగన్’ మూవీ లీక్ కేసును సైబర్ క్రైమ్ వింగ్ ఛేదించింది. ఈ కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ మూవీ పైరసీపై ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే.
‘జన నాయగన్’ (Jana Nayagan) మూవీ లీక్ కేసును సైబర్ క్రైమ్ వింగ్ ఛేదించింది. ఈ కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన ‘జన నాయగన్’ మూవీపై ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. తమిళనాట (Tamil Nadu State) ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఈ సినిమా లీక్ అవడంపై సర్వత్రా ఆసక్తి, అదే టైమ్‌లో రాజకీయ పార్టీలపై (Political Parties) రకరకాలుగా అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అధికార పార్టీనే ఆ పని చేసిందని కొందరు, లేదు.. కావాలనే చిత్రయూనిట్ ఇలా చేసిందని మరికొందరు.. ఇలా ఏదో విధంగా వార్తలైతే వినబడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ వింగ్, అసలు నిందితులును పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించి, కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఘటనపై ఏప్రిల్ 11న నమోదైన క్రైమ్ నంబర్ 47/2026 కేసులో స్టేట్ సైబర్ క్రైమ్ వింగ్ తాజా అప్‌డేట్‌ను విడుదల చేసింది.
‘జననాయగన్’ పైరసీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి, షేర్ చేసిన ఆరుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైన మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సాంకేతిక విశ్లేషణ, డిజిటల్ సాక్ష్యాధారాల ఆధారంగా.. ‘జననాయగన్’ సినిమా డేటాను దొంగిలించి, పైరసీ కాపీని వ్యాప్తి చేసినందుకు గాను సైబర్ క్రైమ్ వింగ్ ఏప్రిల్ 15న మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మరో సినిమాకు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ‘జననాయగన్’ సినిమా ఎడిటింగ్ స్టూడియోలో అతనికి అనుమతి లేనప్పటికీ, అనధికారికంగా సినిమా రీల్స్‌ను యాక్సెస్ చేసి డేటాను దొంగిలించాడు. ఆ దొంగిలించిన డేటాను సినిమాగా మార్చి, తన సహ నిందితులకు షేర్ చేశాడు. దీంతో ఆ పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో విపరీతంగా వ్యాప్తి చెందాయి. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లుగా సైబర్ క్రైమ్ వింగ్ తాజా అప్‌డేట్‌లో పేర్కొంది.
ఈ సందర్భంగా పోలీసులు కొన్ని సూచనలు కూడా చేశారు. అవేంటంటే..
పైరసీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం, స్ట్రీమ్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.
డిజిటల్ పైరసీకి పాల్పడటం, అటువంటి కంటెంట్‌ను ఫార్వార్డ్ చేయడం లేదా ప్రోత్సహించడం చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పైరసీ కంటెంట్ లేదా అనుమానాస్పద లింక్‌లు కనిపిస్తే వెంటనే ఈ క్రింది మార్గాల ద్వారా రిపోర్ట్ చేయండి:
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్: www.cybercrime.gov.in
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: 1930
ఇవి కూడా చదవండి:
Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?
Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!
మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!