సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆగస్ట్‌లో దుల్కర్‌ పాన్ ఇండియా మూవీ

ABN, Publish Date - Apr 18 , 2026 | 10:52 AM

దుల్కర్‌ సల్మాన్‌ తాజా పాన్ ఇండియా మూవీ 'ఐ యామ్‌ గేమ్‌' షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సినిమాను ఐదు భాషల్లో ఆగస్ట్‌లో విడుదల చేయబోతున్నారు.

I am Game Movie

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) 'ఐ యామ్‌ గేమ్‌' (I am Game) మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం షూటింగ్ 11 నెలల్లో, సుమారు 156 రోజులు జరిగింది. దక్షిణ భారతదేశంలోని 100కి పైగా ప్రదేశాలలో దీనిని చిత్రీకరించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్, ఆగస్టు 2026లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

'ఐ యామ్‌ గేమ్‌' మూవీ దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది. గత ఏడాది 'లోక' సాధించిన భారీ విజయం తర్వాత, వేఫరెర్‌ సంస్థ నుండి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రంగా ఇది నిలువబోతోంది. వేఫరెర్‌ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్. ఈ చిత్ర కథను షాబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ సంయుక్తంగా రచించారు.


దుల్కర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కాకుండా, మలయాళ చిత్రసీమలో అత్యంత భారీ నిర్మాణాలలో ఒకటిగా కూడా ఇది నిలువబోతోంది. అలానే మలయాళ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా నిలిచేందుకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఆర్.డి.ఎక్స్' తర్వాత నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా నిలుస్తుంది. ఇందులో ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. దీనికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీని సమకూర్చారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ఫస్ట్ లుక్', 'సెకండ్ లుక్' పోస్టర్లను గతంలోనే విడుదల చేశారు, వీటికి ప్రేక్షకుల నుండి చక్కని స్పందన లభించింది. 'ఐ యామ్‌ గేమ్‌' మూవీని మలయాళ, తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో 'పాన్-ఇండియా' స్థాయిలో థియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?

Updated Date - Apr 18 , 2026 | 10:54 AM