సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

I Am Game: దుల్కర్.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ABN, Publish Date - Jun 15 , 2026 | 08:10 AM

దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఐ యామ్ గేమ్’.

Dulquer Salmaan

దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నహాస్‌ హిదాయత్‌ తెరకెక్కిస్తోన్న యాక్షన్‌ చిత్రం ‘ఐ యామ్‌ గేమ్‌’ (I Am Game). దుల్కర్‌ సల్మాన్‌ సొంత నిర్మాణ సంస్థ వేఫరర్‌ ఫిల్మ్స్ (wayfarer films) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 20న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ తన కెరీర్‌లో మునుపెన్నడూ లేని అత్యంత స్టైలిష్‌, మాస్‌ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఆంటోని వర్గీస్‌, మిస్కిన్‌, కాయదు లోహర్‌, కతిర్‌, పార్థ్‌ తివారి, సంయుక్త విశ్వనాథన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Updated Date - Jun 15 , 2026 | 08:10 AM