ప్రేమ.. అన్నింటికీ అతీతమైనది: దర్శకుడు

ABN , Publish Date - May 20 , 2026 | 11:40 AM

ప్రేమ అనేది మానవత్వం, కులం, మతం, జాతులకు అతీతమైనదని, అలాంటి ప్రేమ గురించి వివరించే చిత్రమే ‘హబీబి’ అని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు.

Habeebi Movie Trailer Launch

ప్రేమ అనేది మానవత్వం, కులం, మతం, జాతులకు అతీతమైనదని, అలాంటి ప్రేమ గురించి వివరించే చిత్రమే ‘హబీబి’ అని ఆ చిత్ర దర్శకుడు మీరా కదిరవన్‌ (Meera Kathiravan) అన్నారు. సీనియర్‌ దర్శకుడు కస్తూరీ రాజా ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని నేశమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌, జీకేఎస్‌ బ్రోస్‌ ప్రొడక్షన్స్‌ పతాకం, రోమియో పిక్చర్స్‌ నిర్మాణంలో మీరా కదిరవన్‌ రూపొందించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ (Habeebi Trailer and Audio Launch) వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. ఇందులో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను రిలీజ్‌ చేసి ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో నటులు పార్తిబన్‌, సముద్రఖని, నాజర్‌, దర్శకులు మగిళ్‌ తిరుమేని, గణేష్‌ కె.బాబు, హరిహరన్‌, దినకరన్‌ శివలింగం, అవినాష్‌, సురేష్‌ రాజకుమారి, చేరన్‌, జహారియా మహ్మద్‌, సుశీంద్రన్‌, వెట్రిమారన్‌, మిష్కిన్‌, దురై, పాండిరాజ్‌, అమీర్‌, కస్తూరి రాజా, రంజింత్‌, రామ్‌, నిర్మాత తేనప్పన్‌, నటి ఈషా, మాళవికా మనోజ్‌, సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ ఆడియో రిలీజ్‌ వేడుకలో చిత్ర దర్శకుడు మీరా కదిరవన్‌ మాట్లాడుతూ.. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత నా పేరును మీరా కదిరవన్‌గా మార్చుకున్నాను. ఇందులో మా అమ్మ పేరు మీరా. తమిళ గుర్తింపు కోసం కదిరవన్‌ అని పెట్టుకున్నాను. అగ్రహారంలో మహమ్మద్‌ యూసుఫ్‌ కథ (ఈ సినిమా స్టోరీ) కోసం ఒక అయ్యంగార్‌ ఆశ్రయం ఇచ్చారు. ప్రేమ అనేది మానవత్వం, కులం, మతం, జాతులకు అతీతమైనది. అలాంటి ప్రేమ గురించి చెప్పే చిత్రమే ఇది. ఈ సినిమా కోసం కస్తూరి రాజా ఎంతగానో సహకరించారు. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగిస్తూ.. సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ‘బ్లాస్ట్‌’ చేసేది ఆ రోజే!

నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల

Updated Date - May 20 , 2026 | 11:40 AM