Haiku: మహిళా కళాశాలలో.. అబ్బాయి చేరితే!
ABN, Publish Date - Oct 07 , 2026 | 09:28 AM
మహిళా కాలేజీలో ఓ అబ్బాయికి అడ్మిషన్ ఎలా లభించింది? కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత అతడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అసలు అతడు చేసిన తప్పేంటి? ఈ ఆసక్తికర ప్రశ్నల చుట్టూ తెరకెక్కిన చిత్రం ‘హైకూ’.
మహిళా కళాశాలలో విద్యార్థికి అడ్మిషన్ ఎలా లభించింది? ఆ కాలేజీలో ఆ యువకుడు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? అతడు చేసిన తప్పు ఏంటి? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కించిన చిత్రం హైకూ (Haiku). తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఏక కాలంలో రూపొందించి ఈ నెల 23న విడుదల చేయనున్నారు. డాక్టర్ డి.అ రుళానందు, మాథ్యూ అరుళానందు సంయుక్తంగా విజన్ సినిమా హౌస్ పతాకంపై నిర్మించగా, యువరాజ్ చిన్నస్వామి కథ సమకూర్చి దర్శకత్వం వహించారు.
ఏగన్ (Eagan), శ్రీదేవి (Sridevi), ఫెమినా జార్జ్ (Femina George) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని మంగళవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ఏగన్, హీరోయిన్ ఫెమినా జార్జ్ కలిసి నిర్మాత అరుళానందు మాట్లాడుతూ, 'వినూత్న కథాంశంతో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించాం. నవతరం ప్రేమకథ. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెటిఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
మహిళా కాలేజీలో ఒక అబ్బాయికి ఎలా అడ్మిషన్ కల్పిస్తారు? వంటి అంశాలను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. తమ తొలి చిత్రం 'జో. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. రెండో చిత్రం 'కోళివన్నై చెల్ల దురై' బాక్సాపీస్ వద్ద నిరాశపరిచింది. 'హైకూ' కథ వినగానే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చి రూ.10 కోట్లకుపైగా బడ్జెట్‌తో నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా చిత్రీకరించాం. కోయంబత్తూరు, చెన్నై బ్యాక్ డ్రాప్‌లో కథ సాగుతుంది' అని వివరించారు.