Anirudh: అనిరుధ్‌ పెళ్లి.. ఓ పక్క ఆసక్తికర చర్చ.. మరోపక్క వివాదం

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:00 PM

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత్రి కావ్యా మారన్ వివాహ బంధంతో ఒకటి కానున్న సంగతి తెలిసిందే.

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత్రి కావ్యా మారన్ వివాహ బంధంతో ఒకటి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకల ఏర్పాట్లు, ఆహ్వాన పత్రికల ఖర్చు, అతిథుల జాబితా గురించి వస్తున్న కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంట వివాహ వేడుకలు గ్రీస్‌లో నవంబర్ 10, 11 తేదీల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనున్నాయట. అనంతరం నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థాయి ప్రముఖులు కూడా హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

శుభలేఖ ఖరీదు రూ.20 వేలా?

ఈ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఆహ్వాన పత్రికల ఖర్చు. ఒక్కో శుభలేఖ కోసం సుమారు రూ.20 వేలు ఖర్చు చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళానిధి మారన్ కుటుంబానికి ఉన్న అపారమైన సంపద, వ్యాపార సామ్రాజ్యం నేపథ్యంలో ఈ ఖర్చుపై  వారికి పెద్ద లెక్కే కాదు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సాధారణ కుటుంబాల్లో పెళ్లి శుభలేఖల కోసం చేసే ఖర్చుతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. 


500 మంది ప్రముఖులకే ఆహ్వానమా?

ఈ వేడుకకు అతిథుల గురించి కూడా చర్చ మొదలైంది. వేలాది మందిని ఆహ్వానించకుండా ఎంపిక చేసిన ప్రముఖులు 500 మందికే  ఆహ్వానాలు పంపుతున్నారని టాక్. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారని తాజా సమాచారం. అంబానీ కుటుంబ వివాహ వేడుకల తరహాలో మారన్ కుటుంబం కూడా భారీ స్థాయిలో ఖర్చు చేయబోతోందంటూ చర్చ నడుస్తోంది.

అనిరుధ్ డోలక్ వీడియోపై వివాదం

అనిరుధ్ తన ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో డోలక్‌పై కూర్చొని ఉత్సాహంగా కనిపించిన వీడియోలు నెట్టింట  వైరల్ అయ్యాయి. అయితే ఆ వేడుక అనిరుధ్ సొంత పెళ్లికి సంబంధించినది కాదని, ఆయన బంధువుల వివాహ వేడుకలో చోటుచేసుకున్న సరదా ఘట్టమని కొందరు నెటిజన్లు  చెబుతున్నారు. మరోవైపు ఒక సంగీత దర్శకుడై  సంగీత వాయిద్యాలపై కూర్చోవడం సంప్రదాయాలకు విరుద్ధమంటూ మరి కొందరు  విమర్శలు చేస్తున్నారు.

ALSO READ:

Sanjay Gupta: ‘కాంటే’, ‘కాబిల్’ చిత్రాల దర్శకుడు ఇకలేరు..

Ritika Singh: అవన్నీ ఫేక్ వీడియోలు.. దయచేసి నమ్మకండి..

Dada: బాలయ్య ఫ్యాన్స్‌కు మ్యూజికల్ ట్రీట్.. ‘దాదా’ అప్‌డేట్



Updated Date - Oct 31 , 2026 | 02:10 PM