Anirudh : కావ్యా మారన్‌తో పెళ్లికి సిద్ధమైన అనిరుధ్.. ఇంట్లో వేడుకలు షురూ
ABN, Publish Date - Oct 31 , 2026 | 09:48 AM
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్యా మారన్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి గురించి, పెళ్లి సెలెబ్రేషన్స్ గురించి వార్తలు విపరీతంగా వైరల్ ఆవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఆసక్తికర ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనిరుధ్ తన ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెళ్లి సంబరాల్లో భాగంగా అనిరుధ్ డోలక్‌పై కూర్చొని నవ్వుతూ, ఉత్సాహంగా స్టెప్పులేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
తన సంగీతంతో అభిమానులను ఉర్రూతలూగించే అనిరుధ్.. ఇప్పుడు తన ఇంట్లో జరుగుతున్న వేడుకల్లోనూ అదే జోష్ చూపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సెలబ్రిటీ జోడీ వివాహం గ్రీస్‌లో జరగనుందంటూ ప్రచారం సాగుతోంది. నవంబర్ 10, 11 తేదీల్లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అనంతరం నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ALSO READ:
IFFA: ఐఫా వేడుకల్లో ధురంధర్ జోరు.. రణ్‌వీర్‌కు ఉత్తమ నటుడి పురస్కారం!
DSP: దేశవ్యాప్తంగా ఫోక్ ఆర్టిస్టులు ఒక్కచోట.. ‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ స్పెషల్!
సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్ చేశారేంటి?