DSP: దేశవ్యాప్తంగా ఫోక్ ఆర్టిస్టులు ఒక్కచోట.. ‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ స్పెషల్!

ABN , Publish Date - Oct 31 , 2026 | 08:02 AM

మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఎల్లమ్మ'. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ సరికొత్త ప్రయోగం చేశారు

మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఎల్లమ్మ' (Yellamma). ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు (Dil raju) నిర్మాత. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. తాజాగా టైటిల్ సాంగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రత్యేకంగా రూపొందించేందుకు డీఎస్పీ భారీ ప్రణాళిక  చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన  100 మంది సంప్రదాయ జానపద కళాకారులను ఈ పాట కోసం ఒకచోట చేర్చారు. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, జానపద సంగీతంలోని ప్రత్యేకతలు ప్రతిబింబించేలా ఈ పాటను స్వరపరిచారు. దీనికి సంబంధించి ఓ టైటిల్ సాంగ్‌లా కాకుండా.. భారతీయ జానపద కళా వైవిధ్యాన్ని చాటిచెప్పేలా ఈ పాటను రూపొందిస్తున్నారు. ఈ విషయాన్నీ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ  సోషల్  మీడియా వేదికగా వెల్లడించింది. 100 మంది ఫోక్ ఆర్టిస్టులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అంతేకాకుండా, త్వరలోనే  తొలి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

Devisri prasad


‘బలగం’తో తెలంగాణ పల్లె జీవితం, మనుషుల అనుబంధాలు, స్థానిక సంస్కృతిని హృద్యంగా తెరపై ఆవిష్కరించిన వేణు.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో మరోసారి జానపద నేపథ్యాన్ని ఎంచుకోవడం విశేషం. డీఎస్పీ సంగీతం, వేణు కథాకథనంతో ఈ సినిమా ఎలాంటి ప్రత్యేకతను చాటుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  జానపద సంగీతానికి సహజమైన వాయిద్యాలు, స్థానిక గాత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాంటి విభిన్న ప్రాంతాల కళాకారుల ప్రతిభను ఒకే పాటలో మేళవించడం ఈ ప్రాజెక్ట్‌లో ఆసక్తికరమైన అంశంగా మారింది.  సోషల్ మీడియాలో 100 మందితో కూడిన కళాకారులతో ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 'థియేటర్ వాళ్ళు బాక్సులు కొత్తవి రెడీ చేసుకోండి లేకపోతే దేవిశ్రీప్రసాద్ పగలగొట్టి వెళ్లిపోతాడు' అని ఓ అభిమాని కామెంట్ చేశారు. 

Devisri prasad

ALSO READ:

బాలయ్య, కొరటాల సినిమా... ఆ రూమర్స్ నమ్మొద్దంటోన్న టీమ్

Ramayana: శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది

కమెడియన్ వడివేలు 100 కోట్ల భవంతిని చూశారా.. ‘హౌస్ టూర్’ వీడియో వైరల్

Updated Date - Oct 31 , 2026 | 09:44 AM