IFFA: ఐఫా వేడుకల్లో ధురంధర్ జోరు.. రణ్‌వీర్‌కు ఉత్తమ నటుడి పురస్కారం!

ABN , Publish Date - Oct 31 , 2026 | 08:18 AM

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్’ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో సత్తా చాటింది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్’ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఈ వేడుకలో అత్యధిక అవార్డులను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది. ఉత్తమ చిత్రం నుంచి నటన, దర్శకత్వం, సాంకేతిక విభాగాల వరకు పలు కీలక పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ ఏడాది ఐఫా వేడుకల్లో ‘ధురంధర్’ పేరు మార్మోగిపోయింది.ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రణ్‌వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది.  ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా కూడా ‘ధురంధర్’ ఎంపికైంది. అంతేకాకుండా సహాయ నటుడి విభాగంలో సంజయ్ దత్, ప్రతినాయకుడి పాత్రలో మెప్పించిన అక్షయ్ ఖన్నా అవార్డులను సొంతం చేసుకున్నారు.

నటన, దర్శకత్వంతో పాటు సాంకేతిక విభాగాల్లోనూ ఈ సినిమా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సంగీత విభాగంలో శాశ్వత్‌కు అవార్డు దక్కగా.. ఉత్తమ కథ, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ విభాగాల్లోనూ ‘ధురంధర్’ పురస్కారాలను గెలుచుకుంది. మొత్తంగా దాదాపు అన్ని ప్రధాన విభాగాల్లో అవార్డులు అందుకుని ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మరోవైపు ‘సైయారా’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనీత్ పడ్డా ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించగా.. ఐఫా పురస్కారం మరో విశేషమైన గుర్తింపుగా నిలిచింది. 


IIFA అవార్డ్స్ విజేతల పూర్తి జాబితా

విభాగం

విజేత

ఉత్తమ చిత్రం

ధురంధర్

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం

అవతార్: ఫైర్ అండ్ యాష్

ఉత్తమ దర్శకుడు

ఆదిత్య ధర్ (ధురంధర్)

ఉత్తమ నటుడు

రణ్‌వీర్ సింగ్ (ధురంధర్)

ఉత్తమ నటి

అనీత్ పడ్డా (సైయారా)

ఉత్తమ సహాయ నటుడు

సంజయ్ దత్ (ధురంధర్)

ఉత్తమ సహాయ నటి

హ్యూమా ఖురేషీ (జాలీ ఎల్‌ఎల్‌బీ 3)

ఉత్తమ విలన్

అక్షయ్ ఖన్నా (ధురంధర్)

ఉత్తమ సంగీత దర్శకుడు

శాశ్వత్ సచ్‌దేవ్ (ధురంధర్)

ఉత్తమ ఒరిజినల్ కథ

ఆదిత్య ధర్ (ధురంధర్)

ఉత్తమ గీత రచయిత

ఇర్షాద్ కామిల్ (సైయారా)

ఉత్తమ నేపథ్య గాయకుడు

ఫహీమ్ అబ్దుల్లా (సైయారా)

ఉత్తమ నేపథ్య గాయని

శ్రేయా ఘోషల్ (సైయారా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ

వికాస్ నౌలఖా (ధురంధర్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే

ఆదిత్య ధర్ (ధురంధర్)

ఉత్తమ డైలాగ్స్

ఆదిత్య ధర్ (ధురంధర్)

ఉత్తమ ఎడిటింగ్

శివకుమార్ వి. పనికర్ (ధురంధర్)

ఉత్తమ సౌండ్ డిజైన్

బిశ్వదీప్ ఛటర్జీ (ధురంధర్)

ఉత్తమ సౌండ్ మిక్సింగ్

అలోక్ డే (ఛావా)

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

ఏఆర్ రెహమాన్ (ఛావా)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

అసెంబ్లేజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రీడిఫైన్ (ఛావా)

ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడు

అహాన్ పాండే (సైయారా)

Updated Date - Oct 31 , 2026 | 09:42 AM