సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మళ్ళీ తెరపైకి.. కమల్ హాసన్ 'మరుదనాయగం'

ABN, Publish Date - Oct 07 , 2026 | 08:12 AM

కమల్ హాసన్ కలల ప్రాజెక్టుల్లో మరుదనాయగం అపుడెపుడో 1997లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.

Marudhanayagam, Kamal Haasan

అగ్ర నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కలల ప్రాజెక్టుల్లో మరుదనాయగం (Marudhanayagam) ఒకటి. అపుడెపుడో 1997లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర నిర్మాణం బడ్జెట్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

1997లో నాటి ముఖ్య మంత్రి కలైంజర్ కరుణానిది (Karunanidhi), బ్రిటన్ రాణి ఎలిజబెత్ (Elizabeth II)పూజా కార్యక్రమంలో పాల్గొని చిత్రాన్ని ప్రారంభించగా, ఆర్థిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై కమల్ హాసన్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు.

కొన్నేళ్ళ క్రితం కూడా ఓ హాలీవుడ్ కంపెనీ సాయంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆయన ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మంచి సత్సంబంధాలు కలిగిన కోలీవుడ్ దర్శకుడు అట్లీ.. పలువురు ఫైనాన్షియర్లతో సంప్రదించి ఈ ప్రాజెక్టుకు జీవం పోయాలన్న తలంపులో ఉన్నట్టు సమాచారం.

అయితే, తనన కలల ప్రాజెక్టు అయిన 'మరుదనాయగం' చిత్రానికి అట్లీ (Atlee) దర్శకత్వం వహించేందుకు కమల్ అనుమతిస్తారా? అన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ మరచి పోయిన 'మరుదనాయగం' ప్రాజెక్టు ఇపుడు మళ్ళీ చర్చకు రావడం గమనార్హం.

Updated Date - Oct 07 , 2026 | 08:45 AM