సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా సందీప్ కిషన్.. సూపర్ సుబ్బు రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే

ABN , Publish Date - Jun 15 , 2026 | 07:58 PM

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సౌత్‌లో సరికొత్త రికార్డుకు తెరలేపింది. తమ మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు (Super Subbu) అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.

Super Subbu

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సౌత్‌లో సరికొత్త రికార్డుకు తెరలేపింది. తమ మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు (Super Subbu) అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ క్రేజీ సిరీస్‌ను డీజే టిల్లు ఫేమ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ లో సందీప్ సరసన మిథిలా పాల్కర్ నటించింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అదికరికంగా ప్రకటించారు.

సూపర్ సుబ్బు సినిమాపై సందీప్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా ఈ కుర్ర హీరోకు సరైన హిట్ లేదు. ఇక ఈ సిరీస్ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ గా ఉండబోతుంది. తెలుగులో ఇప్పటివరకు సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ తో సిరీస్ కానీ, సినిమా కానీ వచ్చింది లేదు. దీంతో ఈ సిరీస్ పై ప్రేక్షకులు కూడా మంచి అంచనాలనే పెట్టుకున్నారు.

సూపర్ సుబ్బు కథ విషయానికొస్తే.. సుబ్రహ్మణ్యం చిల్లుకూరి రావు అలియాస్ సుబ్బు అనే యువకుడు, మాకిపూర్ అనే గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందుతాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా, గ్రామస్తులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అడుగుపెట్టిన సుబ్బు, అక్కడ అనుకోని సంఘటనలు, విచిత్రమైన ప్రశ్నలు, హాస్యభరిత పరిస్థితులు, జీవితాన్ని మార్చే అనుభవాల మధ్య చిక్కుకుంటాడు. ఈ ప్రయాణంలో ప్రేమ, కుటుంబం, కెరీర్‌ను పణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చివరికి అతను తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోగలడా? అనేదే కథ.సమాజంలో చర్చించడానికి ఇబ్బంది పడే ఒక సీరియస్ లైన్‌ను డైరెక్టర్ మల్లిక్ రామ్ పక్కా హిలేరియస్ కామెడీతో, ఎమోషనల్ టచ్‌తో తెరకెక్కించాడు. మరి ఈ సిరీస్ తో సందీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

అజిత్ కూతురిని చూశారా.. హీరోయిన్లు కూడా పనికిరారు

సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని..!

నా బాడీ కౌంట్ 5.. విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Jun 15 , 2026 | 08:11 PM