సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని..!
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:09 PM
టాలీవుడ్.. పాన్ ఇండియా రేంజ్ ని అందుకుంటున్నా.. ఇంకా క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కొత్తగా వచ్చే అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్నారు.
టాలీవుడ్.. పాన్ ఇండియా రేంజ్ ని అందుకుంటున్నా.. ఇంకా క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కొత్తగా వచ్చే అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్నారు. తమ కోరికలను తీర్చాలని, లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లో ఒక సినీ నటిపై జరిగిన వేధింపుల ఉదంతం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్.. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని నమ్మించి మోసం చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ప్రసాద్.. చాలా సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. సినిమాకు కావాల్సిన ఆర్టిస్టులను వెతకడమే అతని పని. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో కథానాయిక స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పి ప్రసద్ ఒక నటిని సంప్రదించాడు. మంచి పాత్ర కావడంతో.. ప్రసాద్ ని నమ్మి సదరు నటి ఆ ప్రాజెక్టులో నటించింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయినా అతని దగ్గర నుంచి రావాల్సిన రూ.90 వేల పారితోషికంతో పాటు, రూ.38 వేల ప్రయాణ ఖర్చులను ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు.
ఎన్నిసార్లు డబ్బులు అడిగినా అతని నుంచి సమాధానం రాకపోయేసరికి నటి.. అతనికి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్దకు రమ్మని చెప్పాడు. బకాయి డబ్బులు ఇస్తాడేమోనని వెళ్లిన ఆమెను.. డబ్బులు ఇవ్వకుండా బెదిరించడమే కాకుండా, బలవంతంగా కారులో తీసుకెళ్లి మరిన్ని సినిమా అవకాశాలు ఇస్తానంటూ, తన కోరికలు తీర్చాలని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే నటి.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి.. ప్రసాద్ పై వేధింపులు కేసు పెట్టింది. తన వద్ద నుంచి తన డబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరింది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్‌లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్