అజిత్ కూతురిని చూశారా.. హీరోయిన్లు కూడా పనికిరారు
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:43 PM
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అజిత్ కి సపారేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు సరైన హిట్ పడలేదు అని చెప్పాలి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అజిత్ కి సపారేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు సరైన హిట్ పడలేదు అని చెప్పాలి. ఇక అజిత్ సినిమాలకు, రేసింగ్ కి ఎంత ప్రాధాన్యతను ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడు. కొంచెం సమయం దొరికినా తన పిల్లలతో కలిసి కనిపిస్తాడు. తాజాగా అజిత్.. తన కూతురు అనోష్క, కొడుకు అద్వైక్ తో సమయం గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముఖ్యంగా ఈ ఫొటోల్లో అనోష్క లుక్స్ చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. అచ్చం హీరోయిన్ మెటీరియల్‌లా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన యాక్టింగ్, అందంతో ఊపేసిన స్టార్ హీరోయిన్, అజిత్ భార్య షాలిని పోలికలతో అనోష్క చాలా క్లాసిక్ అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లోని ప్రస్తుత టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో ఆమె గ్రేస్ ఉందంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చాలా స్టైలిష్ గా తండ్రి ఒడిలో కూర్చొని అజిత్ కి ముద్దు పెడుతూ కనిపించింది. అరే అప్పుడే అనోష్క ఇంత పెద్దది అయిపోయిందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనోష్క చదువులో బిజీగా మారింది. త్వరలోనే ఈ చిన్నది ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఆమె జీన్స్ లోనే నటన ఉంది. తండ్రి స్టార్ హీరో.. తల్లి హీరోయిన్, పిన్ని కూడా హీరోయినే.. అందంలో కూడా అమ్మడు హీరోయిన్ కి ఈ మాత్రం తీసిపోనట్టే కనిపిస్తుంది. ఇక అజిత్ కూతురు అనే బ్రాండ్. ఇంకా అనోష్కకు కూడా ఇండస్ట్రీపై ఆసక్తి ఉంటే చాలు.. కోలీవుడ్ కి మరో హీరోయిన్ దొరికనట్టే అని అజిత్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి కూతురు విషయమై అజిత్ మనసులో ఏం ఉందో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్‌లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్