మిస్టికల్ థ్రిల్లర్ సర్ప్రైజ్‌గా...

ABN , Publish Date - Apr 16 , 2026 | 06:39 PM

ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ఏదైనా సీరిస్, సినిమా వచ్చిందంటే 'ఆహా' అనాల్సిందే. అవి అంతలా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎన్నో వినూత్న ప్రయోగాలతో మెప్పించిన ఆ ఓటీటీ మరో కొత్త కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్‌ ను స్ట్రీమింగ్‌ చేస్తోంది.

ఎప్పటికప్పుడు వినూత్న సినిమాలు, సిరీస్‌లతో తెలుగు వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'. ఇది మరో సరికొత్త వెబ్ సిరీస్ 'పోచమ్మ'ను తన వ్యూవర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌ను శ్రుతి నాయుడు నిర్మించగా, రమేష్ ఇందిర దీనికి దర్శకత్వం వహించారు. దీంతో హైదరాబాద్‌లో 'పోచమ్మ' వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటీనటులు తమ అనుభవాలను పంచుకున్నారు.


'పోచమ్మ' సిరీస్‌లో తాను జెస్సీ అనే పాత్రలో నటించానని నటి స్నేహల్ కామత్ చెప్పారు. అందరితో కలిసి నటించడం చాలా మరపురాని అనుభవం అని గుర్తు చేసుకున్నారు. మరో నటి పూజ మాట్లాడుతూ, 'షూటింగ్ మొదటి రోజు నుంచే ఈ సిరీస్ సక్సెస్ అవుతుందని నమ్మకం కలిగింద'ని విశ్వాసం వ్యక్తం చేశారు. కొన్ని కంటెంట్‌లు మొదట్లో సైలెంట్‌గా ఉంటాయని, రిలీజ్ అయ్యాక బాగా సౌండ్ చేస్తాయని ‘పోచమ్మ’ కూడా అలాంటిదేనని నటుడు అంబటి అర్జున్ ధీమా వ్యక్తం చేశాడు.

కథ విన్నప్పటి నుంచే ఈ సిరీస్ సక్సెస్ అవుతుందని తమకు నమ్మకం ఉందని 'ఆహా' ఓటీటీ కంటెంట్ హెడ్ కవిత అన్నారు. షూటింగ్ సమయంలో పోచమ్మ తల్లి గుడి, విగ్రహాలు ఎదురవడం ఒక ప్రత్యేక అనుభవమని గుర్తు చేసుకున్నారు. టీమ్ అంతా ఆమె మార్గనిర్దేశంలోనే సీన్స్ చేసినట్టు అనిపించిందని తమ అనుభవాలను పంచుకున్నారు. మొత్తంగా మిస్టికల్ థ్రిల్లర్ గా రూపొందిన 'పోచమ్మ' ప్రేక్షకులకు కొత్త అనుభవం అందించనుందని వారు తెలియచేశారు.

Read Also: డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల కట్టడికి అదే మార్గం!

Read Also: పెద్ది.. స్పెషల్‌ సాంగ్‌! పెద్ద క‌థే.. న‌డిచిందిగా

Updated Date - Apr 16 , 2026 | 06:39 PM