సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Last Man in Tower: ఒక్కడే అందరినీ ఎదుర్కొంటే.. ఓటీటీకి అదిరిపోయే ఎమోషనల్ డ్రామా

ABN, Publish Date - Nov 04 , 2026 | 06:19 PM

నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. జీవనశైలితో పాటు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ఎంతటి భారీ మొత్తాలు ముట్టజెప్పినా.. కొన్ని జ్ఞాపకాలను, ప్రాణంగా ప్రేమించే ఇంటిని వదులుకోవడం సామాన్యుడికి అంత సులభం కాదు.

Last Man in Tower

నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. జీవనశైలితో పాటు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ఎంతటి భారీ మొత్తాలు ముట్టజెప్పినా.. కొన్ని జ్ఞాపకాలను, ప్రాణంగా ప్రేమించే ఇంటిని వదులుకోవడం సామాన్యుడికి అంత సులభం కాదు. ఇలాంటి లోతైన మానవీయ కోణంతో, ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన విలక్షణ చిత్రం ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ (Last Man in Tower). మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee), బొమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఆలోచింపజేసే చిత్రం నవంబర్ 6 నుంచి జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా హిందీలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati)కి చెందిన ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని నిర్మించగా, బెన్ రేఖి దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత అరవింద్ అడిగా రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా సూనీ తారాపోరేవాలా స్క్రిప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ముంబైలోని ఓ పాత హౌసింగ్ సొసైటీని రీడెవలప్‌మెంట్ చేసేందుకు బిల్డర్ భారీ ఆఫర్ ఇవ్వడంతో మిగతా ఫ్లాట్ల వారంతా సంతకాలు చేస్తారు. కానీ, రిటైర్డ్ ఫిజిక్స్ టీచర్ యోగేశ్ మిశ్రా (మనోజ్ బాజ్‌పాయ్) మాత్రం తన ఇంటితో ముడిపడిన జ్ఞాపకాలను వదులుకోలేక ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోడు. అందరి ఆశలకు అతడొక్కడే అడ్డుపడుతున్నాడంటూ సొసైటీలోని వారంతా అతడిని వెలివేసినట్లు చూస్తారు. ఈ పోరాటంలో నిర్లక్ష్యానికి గురైన గృహిణిగా, కొడుకు భవిష్యత్ కోసం తపించే సంగీత పురి పాత్రలో దివ్య దత్తా నటించగా.. డెవలపర్ ధర్మేన్ షాగా బొమన్ ఇరానీ మెప్పించారు.


ఈ సందర్భంగా దర్శకుడు బెన్ రేఖి (Ben Rekhi) మాట్లాడుతూ.. అద్భుతమైన టీమ్‌తో కలిసి ఈ చిత్రాన్ని తీయడం సంతృప్తినిచ్చిందని, కాలం గడిచేకొద్దీ ఇలాంటి అంశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ‘‘యోగాశ్‌ది ఎంతో సంక్లిష్టమైన పాత్ర. నగరాల్లో రీడెవలప్‌మెంట్ వెనుక ఉండే భావోద్వేగాలను, కుటుంబాలపై పడే ప్రభావాన్ని ఇందులో చూపించాం. ఇల్లు అంటే నాలుగు గోడలా లేక మనుషులా అన్న ప్రశ్నకు ప్రతి ఒక్కరూ సమాధానం వెతుక్కుంటారు’’ అని చెప్పారు.


దివ్య దత్తా మాట్లాడుతూ.. పాత్రల ప్రవర్తనలోని మంచి చెడులను కాకుండా వారి పరిస్థితులను సహజంగా ఆవిష్కరించడం వల్లే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని తెలిపారు. నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘మనం జీవితంలో దేనిని వదులుకుంటాం, దేనిని చివరిదాకా పట్టుకుని ఉంటాం అనే మానవీయ కోణాన్ని ఇందులో అద్భుతంగా చూపించారు. నటీనటుల ప్రతిభ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

వి.వి. వినాయక్ సమక్షంలో కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

రేంజ్ మ్యాటర్.. చిరు ‘కాకా’కి తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్

‘టైసన్ నాయుడు’ నుంచి మాస్ ఫోక్ సాంగ్.. ఎప్పుడంటే

Updated Date - Nov 04 , 2026 | 06:19 PM