Husharu Pittalu Ott: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘హుషార్‌ పిట్టలు’..

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:48 AM

ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషార్‌ పిట్టలు’ (Husharu Pittalu) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషార్‌ పిట్టలు’ (Husharu Pittalu) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో (Amazon Prime) స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో థియేటర్లలో సినిమాను మిస్‌ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి నుంచే ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించింది. అన్షు, వాసవి గణేషన్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని యూత్‌ను ఆకట్టుకునే కథాంశంతో పాటు భావోద్వేగ అంశాలను మేళవిస్తూ తెరకెక్కించారు. బీవీజీ స్టూడియోస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. బిక్షు దర్శకత్వం వహించారు. సురేష్‌, ఏషియన్‌ ఫిల్మ్‌ సంస్థలు ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశాయి.

థియేట్రికల్‌ రన్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావడంతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో చూడలేకపోయిన యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లలో తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఓటీటీలోనూ అదే విధంగా ఆదరిస్తారనే నమ్మకాన్ని నిర్మాత వెంకట్‌ యాదవ్‌ వ్యక్తం చేశారు.

కథ : 

మాసినపల్లి రవి (అన్ష్) చదువులో ఫస్ట్. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, ఎట్రాక్షన్ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే! అతని చుట్టూ ఉండే బ్యాచ్లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పు దారి లోకి తీసుకు వెళతాడు. బాలన్న మాటలకు, చేష్టలకు ఎట్రాక్ట్ అయిన రవి ఆపై చిట్టి తల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమితో ఇద్దరూ దారి తప్పి, హద్దులు దాటే దాకా వెళతారు. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి) హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. అప్పుడు వారిద్దరి కుటుంబాలు ఎలా స్పందించాయి? చిన్న వయసులో తెలిసీ తెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి? అన్నది కథ.  

ALSO READ:
Husharu Pittalu Review: హుషారు పిట్టలు ఎలా ఉందంటే..


Updated Date - Sep 15 , 2026 | 12:03 PM