అడివి శేష్ ‘డెకాయిట్’ స్ట్రీమింగ్ వివరాలివే!

ABN , Publish Date - Apr 29 , 2026 | 08:40 PM

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెకాయిట్’. శానిల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

Dacoit Movie Still

అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). శానిల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి స్పందననే రాబట్టుకుంది. ఇక ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగించుకుని, ఓటీటీలో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ (Dacoit OTT Details)కు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తల ప్రకారం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఓటీటీలో ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


‘డెకాయిట్’ కథ విషయానికి వస్తే.. హరి (అడివి శేష్‌) ఓ అనాథ. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన మెడికో జూలియట్‌ ఉరఫ్‌ సరస్వతిని లవ్‌ చేస్తాడు. అతని జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుని, అత్యాచారం, హత్య కేసులో జైలు పాలవుతాడు. సరస్వతి గతాన్ని మనసులోంచి చెరిపేసి మూవ్‌ ఆన్‌ అవుతుంది. పెళ్ళి చేసుకుని ఓ పాపను కంటుంది. ప్రేమ పేరుతో తనని బలిపశువును చేసిన సరస్వతి మీద కక్ష తీర్చుకోవాలని, హరి జైలు నుండి తప్పించుకుని బయటకు వస్తాడు. తన పగ తీర్చుకోవాలనుకునే సమయంలో సరస్వతి పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉందని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో హరి ఆమెపై కక్ష తీర్చుకున్నాడా? లేక క్షమించి వదిలేశాడా? మరోసారి ప్రేమ పుట్టి ఆమెను కష్టాల ఊబి నుండి బయటకు తీశాడా? ఈ క్రమంలో జైలు నుండి తప్పించుకున్న అతని కోసం వేటాడుతున్న పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు

Theater Movies: ఈ వారం.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ సినిమాలు

చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా

Updated Date - Apr 29 , 2026 | 08:40 PM

Dacoit Review: అడివి శేష్‌.. డెకాయిట్‌ మూవీ రివ్యూ

Dacoit: ప్రేమించావు.. కానీ మోసం చేశావు 

Dacoit: ఎట్ట‌కేల‌కు.. అడ‌వి శేష్ సినిమా వ‌చ్చేస్తోంది... డెకాయిట్ రిలీజ్ డేట్ ఇదే

Dacoit: అడివి శేష్- జోనిత షేక్ చేసిన సాంగ్ వచ్చేసింది

Dacoit: తెలుగోడు, హీందీవోడు కలసి చేశాం.. అమెరికన్‌ స్టైల్‌లో ఉంటుంది