సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Alpha: నెలాఖరులో ఓటీటీలోకి...

ABN, Publish Date - Aug 24 , 2026 | 06:14 PM

యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఆల్ఫా ఈ నెల 28న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కాబోతోందని సమాచారం. ఇందులో అలియాభట్, శార్వరి కీలక పాత్రలు పోషించారు.

Alpha movie

యశ్‌ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో వచ్చిన తొలి మహిళా ప్రధాన చిత్రం 'ఆల్ఫా'. అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా జూలై 3న జనం ముందుకు వచ్చింది. అయితే థియేట్రికల్ గా 'ఆల్ఫా' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. వరల్డ్ వైడ్ సుమారు వంద కోట్ల గ్రాస్ ను మాత్రమే వసూలు చేయగలిగింది. అనిల్‌ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ 28 నుంచి ఇది ప్రసారం అవుతుందని తెలుస్తోంది.


దర్శకుడు శివ్ రావైల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆలియా భట్ ‘సీత’, శర్వరి ‘దుర్గా’ పాత్రలను పోషించారు. అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన ‘ఆల్ఫా’ సైనికులుగా ఇద్దరూ ఓ ప్రమాదకరమైన మిషన్‌లో కలిసి పోరాడాల్సి వస్తుంది. మహిళా గూఢచారిణుల కథను ప్రధానంగా చూపించిన తొలి చిత్రం కావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. యశ్‌ రాజ్ ఫిలిమ్స్ తీసిన స్పై యూనివర్స్‌లో 'ఆల్ఫా' ఏడో భాగం. ఈ బ్యానర్ లో ఈ యూనివర్శ్‌ నుంచి తొలుత 'ఏక్ థా టైగర్' వచ్చింది. ఆ తర్వాత వరుసగా 'టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3, వార్ 2' చిత్రాలు వచ్చాయి. అయితే రాబోయే 'పఠాన్ 2, వార్ 3'లో అలియా భట్, శార్వరి పాత్రలు కూడా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Varanasi: 50 భాషల్లో.. జక్కన్న అంటే ఆ మాత్రం ఉండాల్సిందే

కేవలం 3 రోజుల్లోనే.. రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్

‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ హీరో అవుతున్నాడు.. సినిమా టైటిల్ ఇదే

Updated Date - Aug 24 , 2026 | 06:15 PM