సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nomore: జమునారాణి తొలి గీతం!

ABN, Publish Date - Jul 31 , 2026 | 02:10 PM

ప్రముఖ నేపథ్య గాయని జమునారాణి తన 88వ యేట బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆమె తొలి గీతం విశేషాలు ఇవి.

Jamuna Rani

సంగీత కుటుంబంలో జన్మించిన జమునారాణి తొలి గీతాన్ని పాడింది 1946లో వచ్చిన త్యాగయ్య చిత్రంలో అనుకుంటారు కానీ ఆమె అంతకు రెండేళ్ళ ముందే 'తాశిల్దారు' సినిమాలో పాట పాడారు. అందులో 'ఆహా ఏమందువే చిన్నవదినా' అనే పాటను జమునా రాణి పాడారు. అప్పుడు ఆమె వయసు ఏడేళ్ళు. ఆ సినిమాకు సంగీత దర్శకుడు పద్మనాభ శాస్త్రి. జమునారాణి బంధువుకు బాగా తెలిసిన వాడు కావడంతో ఆమెకు పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటను బేబీ కమల కుమారి మీద చిత్రీకరించారు. ఆ తర్వాత 'త్యాగయ్య'లో బాల తారల మీద చిత్రీకరించిన 'మధురా నగరిలో చల్లనమ్మ బోదు' పాటను జమునారాణితో పాడించారు. కోమలతో కలిసి ఆ పాటను జమునారాణి పాడారు. బేబీ వనజ, శ్యామలపై ఆ పాటను చిత్రీకరించారు.


బాలనటిగా తెరపై!

జమునారాణికి తొలి అవకాశం నటిగా 'సీతారామ జననం (1944)లో వచ్చింది. అందులో చిన్నప్పటి సీతగా నటించమని దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య కోరారు. కానీ ఇంట్లో వారు అంగీకరించకపోవడంతో జమునారాణి నటించలేదు. అయితే భానుమతి, రామకృష్ణ తమ కుటుంబానికి బాగా కావాల్సిన వారు కావడంతో వారి కోరిక మేరకు జమునా రాణి 1947లో 'రత్నమాల' చిత్రంలో అంపకాల పాటను భానుమతితో కలిసి పాడింది. అందులో ఆమె చెలికత్తెగానూ తెర మీద కనిపించింది. అదే చిత్రంలో జమునారాణి సీత మీద చిత్రీకరించిన వగలాడి నిను చేరురా పాటనూ పాడింది. అప్పట్లో పాటలను చాలావరకూ నటీనటులే పాడుతుండటంతో నేపథ్య గాయనీ మణుల పేరు గ్రామఫోను రికార్డుల మీద వచ్చేది కాదు. అలా జమునారాణి చిన్నప్పుడు పాడిన పాటల గ్రామఫోను రికార్డులలో ఆమె పేరు నమోదు కాలేదు.

ఇవి కూడా చదవండి:

సినిమా రివ్యూ: ‘నూటన్స్‌ థర్డ్‌ లా’

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

Spider-Man: Brand New Day Review: స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ

Updated Date - Jul 31 , 2026 | 02:15 PM