సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రౌడీ వేర్ బ్రాండ్‌కు ఫ్యాన్స్‌గా డైరెక్టర్స్.. విజయ్ క్రేజ్ ఇది!

ABN, Publish Date - Aug 12 , 2026 | 07:14 PM

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ నటుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం నటుడిగానే కాకుండా ఒక విజన్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ విజయ్ తన సత్తా చాటుతున్నారు.

Vijay Deverakonda Rowdy Wear

పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోలలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీ నటుడిగా ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా ఒక విజన్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ విజయ్ తన సత్తా చాటుతున్నారు. ఆయన స్వయంగా ప్రారంభించిన ‘రౌడీ వేర్’ (Rowdy Wear) దుస్తుల బ్రాండ్ ప్రస్తుతం యూత్‌లోనే కాకుండా సెలబ్రిటీలలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రారంభంలో యువతను ఆకట్టుకున్న ఈ బ్రాండ్, ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్ల ఫేవరేట్ ఫ్యాషన్ వేర్‌గా రూపాంతరం చెందిందంటే అతిశయోక్తి కానే కాదు.


తాజాగా టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకులు సుజీత్ సింగ్, సాయి రాజేష్, అభిషాన్ జీవింత్ వంటి ప్రతిభావంతులైన మేకర్స్ కూడా ఈ రౌడీ వేర్ బ్రాండ్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయారు. విజయ్ దేవరకొండపై ఉన్న అభిమానంతో పాటు ఈ బ్రాండ్ అందించే అవుట్‌ఫిట్స్ స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా ఉండటంతో వారు ఈ దుస్తులను ధరిస్తూ.. తమ ఫ్యాషన్ ఐడెంటిటీని చాటుకుంటున్నారు. తమకు నచ్చిన హీరో క్రియేట్ చేసిన బ్రాండ్‌ను ధరించడం ద్వారా విజయ్‌పై తమకున్న ప్రేమాభిమానాలను ఈ దర్శకులు ఈ రకమైన స్టైల్‌తో వ్యక్తం చేస్తున్నారు.


మొదట డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన రౌడీ వేర్, రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణతో.. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనూ ఫ్యాషన్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ట్రెండీ కలెక్షన్స్, డిఫరెంట్ అప్పీరెన్స్, యంగ్ యాటిట్యూడ్‌కి ప్రతీకగా నిలుస్తున్న ఈ బ్రాండ్, రాబోయే రోజుల్లో మరింత విస్తరించి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందనేలా విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇవి చదవండి:

నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా.. హీరోయిన్ జో శర్మకు నాఫా అవార్డ్

ఎన్టీఆర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స.. హెల్త్ బులిటెన్ విడుదల

ఫ్యాన్స్ వద్దా.. జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Aug 12 , 2026 | 07:14 PM