నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా.. హీరోయిన్ జో శర్మకు నాఫా అవార్డ్
ABN , Publish Date - Aug 12 , 2026 | 05:30 PM
నార్త్ అమెరికన్ ఫిల్మ్ అసోసియేషన్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, ప్రముఖ దిగ్గజ మరాఠీ నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా ఇండో-అమెరికన్ నటి, ‘M4M’ మూవీ హీరోయిన్ జో శర్మ ‘నాఫా రికగ్నిషన్ అవార్డు’ను అందుకున్నారు.
ఆగస్ట్ 7 నుండి 9 వరకు కాలిఫోర్నియాలోని సాన్ హోసేలో జరిగిన 3వ నాఫా (NAFA - నార్త్ అమెరికన్ ఫిల్మ్ అసోసియేషన్) మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, ప్రముఖ దిగ్గజ మరాఠీ నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా ఇండో-అమెరికన్ నటి, ‘M4M’ మూవీ హీరోయిన్ జో శర్మ (Jo Sharma) ‘నాఫా రికగ్నిషన్ అవార్డు’ (NAFA Recognition Award)ను అందుకున్నారు. జో శర్మ నాఫా రెడ్ కార్పెట్‌పై మెరిసి, మీడియా లాంజ్‌లో ఈ అవార్డును స్వీకరించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ (North American Film Association Marathi Film Festival)లో మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో రోహిణి హట్టంగడి, అజింక్య దేవ్, మహేష్ కొఠారే, గిరీష్ ఓక్, శృతి మరాఠే, అతుల్ కులకర్ణి, నాగరాజ్ మంజులే, ప్రసాద్ ఓక్, మంజిరి ఓక్, తృప్తి భోయిర్, సాయి దేవధర్ తదితరులు ఉన్నారు.
ఈ ఫెస్టివల్‌లో ఆకట్టుకునే రెడ్ కార్పెట్, సినిమా ప్రీమియర్స్, మాస్టర్ క్లాసెస్, మీట్ అండ్ గ్రీట్ సెషన్స్, M4M-2 Movie ఆడిషన్స్, అలాగే కళాకారులతో ప్రత్యేకమైన ఇంటరాక్షన్స్ నిర్వహించారు. అమెరికాలోని మరాఠీ ప్రేక్షకులు తమ అభిమాన తారలతో మమేకమయ్యే అరుదైన అవకాశాన్ని ఈ వేడుక కల్పించింది. అంతర్జాతీయ వేదికపై మరాఠీ సినిమాల ప్రతిభను చాటుతూనే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన, విభిన్నమైన ఫిల్మ్ మేకింగ్ ప్రతిభను ప్రదర్శించేందుకు ఎంపిక చేసిన అంతర్జాతీయ లఘు చిత్రాలను కూడా ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన డా. హర్ష ములేకు ఆర్గనైజర్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ విలువైన మద్దతును అందించిన మానసి డియోలేకర్, రుచా క్షీరసాగర్, మయూర ఖతావ్కర్, స్నేహల్ అథవాలే, స్మిత, స్నేహ, శృతి, శుభదా ఇంగోలేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మూడు రోజులు సాన్ హోసే నగరం మరాఠీ సినిమాకు ఒక ప్రతిష్టాత్మకమైన నిలయంగా మారింది. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నాఫా, మరాఠీ చిత్రసీమ యొక్క గొప్ప సంస్కృతి, ప్రతిభ, స్ఫూర్తిని అంతర్జాతీయ వేదికపై వేడుకగా జరుపుకుంటూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరాఠీ ఫిల్మ్ మేకర్లకు, ప్రేక్షకులకు మధ్య బంధాన్ని మరోసారి మరింత బలోపేతం చేసింది.
ఇవి చదవండి:
ఎన్టీఆర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స.. హెల్త్ బులిటెన్ విడుదల
ఫ్యాన్స్ వద్దా.. జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
Jani Master: తప్పులు జరిగాయి.. దయచేసి క్షమించండి