Virosh: విరోష్.. మరో గ్లోబల్ రికార్డ్!
ABN, Publish Date - May 13 , 2026 | 10:16 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి మరో గ్లోబల్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఈ రికార్డ్స్ చూసి.. ఈ జంటలో ఏదో మ్యాజిక్ ఉందని అంతా కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కలిసి మరో గ్లోబల్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న యాడ్స్ ఇన్‌స్టాగ్రామ్ లైక్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ఈ లైక్స్ తెలియజేస్తున్నాయి. ఈ జంట ఇటీవల కలిసి చేసిన ఎయిర్ బీఎన్‌బీ కపుల్ యాడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్ పైగా లైక్స్ రాబట్టి.. సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ లైక్స్ ఇంకా ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్‌కు వరల్డ్ వైడ్‌గా వచ్చిన సెకండ్ హయ్యెస్ట్ లైక్స్ ఇవే కావడంతో విరోష్ అభిమానుల ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి.
మరో విశేషం ఏమిటంటే.. ఫస్ట్ హయ్యెస్ట్ లైక్స్ యాడ్ కూడా విరోష్ చేసిందే కావడం విశేషం. వీరి వెడ్డింగ్ టైమ్‌లో ఎండార్స్ చేసిన మాన్యవార్ యాడ్ 11.5 మిలియన్‌కు పైగా లైక్స్‌తో హయ్యెస్ట్ లైక్డ్ యాడ్ పోస్ట్‌గా గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పోస్ట్‌కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్. సౌత్ ఇండియాకు చెందిన ఈ కపుల్స్.. ఇంటర్నేషనల్ లెవల్‌లో పెద్ద పెద్ద ప్లేయర్స్‌కు కూడా ఈ విషయంలో షాకిచ్చారంటే.. వారి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్‌కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్‌కు దక్కాయి.
వరల్డ్ వైడ్ సోషల్ మీడియాలో అడ్వర్టయిజింగ్‌లో విరోష్ జోడి ఇలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుండటంతో వీరిద్దరిలో ఏదో మ్యాజిక్ ఉందని అంతా అనుకుంటున్నారు. ఈ రికార్డ్ స్థాయి లైక్స్ విజయ్, రష్మిక చేస్తున్న యాడ్స్‌కు గ్లోబల్ రీచ్ తీసుకొస్తున్నాయి. మరోవైపు ఈ జంట ‘రణబాలి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం