టెలివిజన్ అండ్ ఓటీటీ రంగంలో కీలక అడుగు.. TOPCOS ఏర్పాటు
ABN, Publish Date - Jun 12 , 2026 | 06:10 PM
గత రెండేళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల టెలివిజన్ నిర్మాతలతో ఎన్నోసార్లు చర్చించి, చివరగా జనవరి 2026లో చెన్నైలో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి మీటింగ్ నిర్వహించుకుని.. ఫైనల్‌గా ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’ను ఏర్పాటు చేశారు.
గత రెండేళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల టెలివిజన్ నిర్మాతలతో ఎన్నోసార్లు చర్చించి, చివరగా జనవరి 2026లో చెన్నైలో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి మీటింగ్ నిర్వహించుకుని.. ఫైనల్‌గా ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’ (TOPCOS)ను ఏర్పాటు చేసినట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిజంగా ఇది టెలివిజన్ అండ్ ఓటీటీ రంగంలో కీలక అడుగుగా భావించవచ్చు. TOPCOS కోసం కావలసిన అన్ని ప్రక్రియలు రిజిస్ట్రేషన్, బైలాస్ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా.. సంస్థను అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ టాప్కోస్‌కు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.
ఈ సందర్భంగా TOPCOS అధ్యక్షుడు ఏ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటిటి పరిశ్రమ గుర్తించుకోదగిన చారిత్రాత్మకమైన రోజుగా దీనిని మేం పరిగణిస్తున్నాం. ఎందుకంటే నాలుగు రాష్ట్రాల నిర్మాతల మండళ్లు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడటం ఇదే మొదటిసారి. దీని వెనుక రెండున్నరేళ్ల కృషి ఉంది. దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలో 2011లో టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పడింది. 2012 నుంచి బైలాస్ తయారు చేసుకుని, రూల్ ఆఫ్ వర్కింగ్ ప్యాట్రన్ తయారు చేసుకున్నాం. ఇది 15యేళ్లు పూర్తి చేసుకుంది. అయితే టాప్కోస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం.. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గత 15యేళ్లుగా దానికి సాధించిన విజయాలే. గత మూడేళ్ల నుంచి ఇంటర్ స్టేట్ ప్రొడక్షన్స్ బాగా పెరిగాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్జేంజ్ పెరిగింది. కన్నడ నుంచి ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ రావడం.. ఇక్కడి ప్రొడ్యూసర్స్ కన్నడకి, తమిళ్‌కు వెళ్లడం.. ఇంకా తమిళనాడు, కేరళ.. ఇలా ఇంటర్ స్టేట్ యాక్టివిటీస్ పెరగడంతో.. ఈ నాలుగు రాష్ట్రాల నిర్మాతల మధ్య ఒక సమన్వయం ఉంటే బాగుంటుందని.. రెండు సంవత్సరాలుగా ఈ సంస్థని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. అందరితో అనేక చర్చలు, తీర్మానాలు చేసిన అనంతరం ఈ జనవరిలో చెన్నైలో నాలుగు రాష్ట్రాల నిర్మాతలు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మీటింగ్ తర్వాత TOPCOS ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒక కామన్ ప్లాట్ ఫామ్‌లో నిర్మాతల కోసం వారి సంక్షేమం గురించి ఫైట్ చేయవచ్చని 2026 జనవరిలో చెన్నెలో జరిగిన సమావేశలంలో నిర్ణయించుకోవడం జరిగింది.
దీంతో పాటు మొత్తం 17మందితో ఒక అడ్ హాక్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం చాలా కష్టపడ్డాం. సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఒక చట్ట ప్రకారం తయారు చేయడానికి మార్గదర్శకమైన గైడ్ లైన్స్ లేవు. మా నుంచి ప్రతి సమస్య, ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషించుకుని.. దాని నుంచి కార్యాచరణ రూపొందించుకుంటూ ప్రతి సమస్యను సునిశితంగా పరిశీలించి అనేక చర్చల తర్వాత ఒక బై లా తయారు చేసుకోవడం జరిగింది. ఈ బై లా మొట్టమొదటి సారిగా టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్ కోసం ఏర్పాటు చేయడం విశేషం. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ టెలివిజన్ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ఇది మరింతగా బలపడాలని కోరుకుంటున్నాం.
మా ప్రధాన లక్ష్యం ప్రతి భాషకూ ప్రత్యేకమైన కల్చర్ ఉంటుంది. ప్రత్యేకమైన వర్కింగ్ ప్యాట్రన్ ఉంటుంది. రెమ్యూనరేషన్స్, బడ్జెట్స్ వేరుగా ఉంటాయి. ఒక్కో భాషలో ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆయా భాషలలో ఉండే వర్కింగ్ కల్చర్‌ను గౌరవిస్తూనే.. ఎక్జేంగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఎక్జేంగ్ ఆఫ్ ఆర్టిస్ట్స్, ఎక్జేంగ్ ఆఫ్ టెక్నీషియన్స్.. ఇలా కామన్‌గా ఉండే ఇష్యూస్ మీద నాలుగు భాషల నిర్మాతల మండళ్లు, ఒకే కామన్ కోడ్‌తో పనిచేయాలనేదే. నాలుగు రాష్ట్రాల నిర్మాతల సంక్షేమం, వారి హక్కులు, బాధ్యతలను గుర్తు చేస్తూ.. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ.. ప్రభుత్వాలను కూడా రిప్రజెంట్ చేస్తూ.. సౌత్ ఇండియన్ టివి, ఓటిటి ఇండస్ట్రీ పర్ఫెక్ట్ గా, ప్రొడక్టివ్‌గా రన్ చేయడం కోసం గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది మా TOPCOS ప్రధాన ఉద్దేశ్యం. దీనికి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాం. టీవీ పరిశ్రమను సినిమా పరిశ్రమ నుంచి వేరు చేయడానికే మాకు మూడేళ్ల టైమ్ పట్టింది. ఇవాళ టీవీ పరిశ్రమ ఎంత గొప్పగా ఎదిగింది. సినిమాల్లోని ఆర్టిస్టుల కంటే సీరియల్స్‌లో ఉండే ఆర్టిస్టులను బాగా గుర్తు పడుతున్నారు. దాదాపు 15వేల మంది తెలుగు టీవీ పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. అంటే మిగతా భాషల నుంచి ఇంకా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పెద్ద పరిశ్రమను పకడ్బందీగా నడిపించడం కోసం మేం నిర్మాతల మండళ్లు, TOPCOSను ఒక ఎజెండాగా తీసుకుని కృషి చేయడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి నిర్మాతలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ఉన్నాం. మా తర్వాత టార్గెట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. అన్ని భాషల్లో ఉన్నటువంటి టీవీ, ఓటీటీ పరిశ్రమల నిర్మాతలందరినీ సమన్వయ పరిచి.. ఒక నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అనేది మా ముందున్న లక్ష్యంగా వెళుతున్నాం’’ అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో TOPCOS వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, కర్ణాటకకు చెందిన ఎగ్జిక్యూటివ్ మెంబర్ సునిల్ కుమార్ జే.కే, కేరళకు చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణన్ సేతుకుమార్, చెన్నైకి చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజా వేలు, ట్రెజరర్ డి.వై చౌదరి మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ
బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!