సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పబ్‌లో.. బుల్లితెర నటికి వేధింపులు

ABN, Publish Date - Sep 29 , 2026 | 06:47 AM

కుటుంబసభ్యులతో పబ్‌కు వచ్చిన ఓ బుల్లితెర నటిని గుర్తుతెలియని వ్యక్తులు వేధింపులకు గురిచేశారు.

tv actress

కుటుంబసభ్యులతో పబ్‌కు వచ్చిన ఓ బుల్లితెర నటిని గుర్తుతెలియని వ్యక్తులు వేధింపులకు గురిచేశారు. అడ్డుకోబోయిన ఆమె సోదరుడు, బావపై కూడా దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) కు చెందిన బుల్లితెర నటి హేమభవాని ఈనెల 27న సోదరుడు సురేష్ రెడ్డి, బావ రాహుల్‌తో కలిసి రోడ్డు నంబరు 36లోని క్లబ్ రోగ్ (Club Rogue) పబ్‌కు వచ్చారు.

ఓ టేబుల్ వద్ద కూర్చొని మాట్లాడుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హేమభవానీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిని అడ్డుకోబోయిన ఆమె సోదరుడు సురేష్ రెడ్డి, బావ రాహుల్‌పై దాడి చేశారు. దీన్ని గమనించిన పబ్ బౌన్సర్లు వారిని బయటకు పంపించేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో పబ్‌లో..

నగరానికి చెందిన యువతి(26) జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లోని ఎయిర్ లైవ్ ప‌బ్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 27న ప‌బ్‌కు వ‌చ్చిన‌ అత్తాపూర్‌కు చెందిన రమేష్ అగర్వాల్ యువతి పట్ల అస భ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 29 , 2026 | 07:08 AM