సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లవ్‌ - రిలేషన్‌‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - May 15 , 2026 | 10:47 PM

నేటి యువతకు ప్రేమ, సంబంధం (రిలేషన్‌) అంటే ఏంటో తెలియదని హీరోయిన్‌ తమన్నా అంటున్నారు. విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పినప్పటి నుంచి, సమయం దొరికిన ప్రతిసారి ఇలా ఏదో ఒక లెక్చర్‌ను ఈ మిల్కీ బ్యూటీ ఇస్తూనే ఉంది.

Tamannaah Bhatia

నేటి యువతకు ప్రేమ, సంబంధం (రిలేషన్‌) అంటే ఏంటో తెలియదని హీరోయిన్‌ తమన్నా (Tamannaah Bhatia) అంటున్నారు. విజయ్ వర్మ (Vijay Varma)కు బ్రేకప్ చెప్పినప్పటి నుంచి, సమయం దొరికిన ప్రతిసారి ఇలా ఏదో ఒక లెక్చర్‌ను తమన్నా ఇస్తూనే ఉంది. ఆమె లెక్చర్ వింటుంటే.. ఇందులోనే ఆమె బ్రేకప్‌కి కారణం ఉందా? అని అనిపించేలా ఉంటుందంటే, అతిశయోక్తి కానే కాదు. అసలెందుకు విజయ్ వర్మతో బ్రేకప్ అయిందనే విషయం ఇప్పటి వరకు రివీల్ చేయని తమన్నా.. ప్రేమ ఒక్కరికే, ఒక్కరితోనే ఉండాల్సిన అవసరం లేదని, ఎన్నిసార్లైనా ప్రేమలో పడవచ్చంటూ.. సరికొత్త అర్థాన్ని యువతకు తెలియజేస్తోంది.


తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. అది ఒక్కసారి మాత్రమే కాదు.. పలుమార్లు పుడుతుంది. అదే నిజమైన ప్రేమ. నేటితరం యువతకు లవ్‌, రిలేషన్‌ అంటే ఏంటో తెలియదు. మరికొందరు గందరగోళానికి గురవుతుంటారు. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించాలని భావిస్తే.. వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. మన భావాలను బలవంతంగా రుద్దడం ద్వారా ప్రేమను నిరూపించుకోలేరు. ప్రేమ అనేది ఒకే ఒకసారి అనుభవంగా ఉండాల్సిన పనిలేదు. అది జీవితంలో అనేకసార్లు జరగాల్సిన ప్రేరణ. అది బహిరంగంగా హావభావాల ద్వారా వ్యక్తపరిచేది కాదు. భావోద్వేగపరంగా అంతర్లీనంగా పుడుతుంది’’ అని పేర్కొన్నారు.


ఆమె మాటలు చూస్తుంటే.. ప్రేమ విషయంలో ఆమె స్వేచ్ఛను కోరుకుంటుందనే విషయం అర్థమవుతోంది. ఈ స్వేచ్ఛ కారణంగానే విజయ్ వర్మకు ఆమె బ్రేకప్ చెప్పిందా? అసలు పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట.. సడెన్‌గా విడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? తమన్నాని విజయ్ వర్మ అనుమానించాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. పైన ఆమె చెబుతున్న మాటలను చూస్తుంటే.. కచ్చితంగా ఏదో మెసేజ్ అయితే తమన్నా (Tamannaah) ఇస్తుందని మాత్రం అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!

మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్‌!

Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!

Updated Date - May 15 , 2026 | 10:47 PM