సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సైమా 14వ ఎడిషన్‌ నామినేషన్స్‌లో ఈ తెలుగు చిత్రాలదే హవా..

ABN, Publish Date - Jul 30 , 2026 | 09:30 PM

దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘సైమా’ 14వ ఎడిషన్ నామినేషన్ల వేడుక గ్రాండ్‌గా షురూ అయింది. 2025 సంవత్సరంలో విడుదలైన నాలుగు దక్షిణ భారత భాషల చిత్రాలకు సంబంధించి నామినేషన్స్ మొదలయ్యాయి.

Siima 2025 Nominations

దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘సైమా’ (SIIMA - South Indian International Movie Awards) 14వ ఎడిషన్ నామినేషన్ల వేడుక గ్రాండ్‌గా షురూ అయింది. 2025 సంవత్సరంలో విడుదలైన నాలుగు దక్షిణ భారత భాషల (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను గౌరవిస్తూ నిర్వాహకులు అధికారిక నామినేషన్ల వివరాలను ప్రకటించారు. వినూత్న కథనాలు, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్‌లు, అద్భుతమైన మ్యూజిక్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న పలు సినిమాలు ఈ నామినేషన్ల రేసులో నిలిచాయి.


నాలుగు భాషల్లోని టాప్ నామినేటెడ్ సినిమాల విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) ముందంజలో ఉండగా, తమిళం నుంచి ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ (Dragon), మలయాళం నుంచి 'లోక' (Lokah) చిత్రాలు ప్రధాన విభాగాను ఆక్రమించాయి. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ (Mirai) చిత్రం ఏకంగా 11 నామినేషన్లతో టాలీవుడ్‌లోనే అత్యధిక విభాగాల్లో నిలిచి టాప్‌లో దూసుకెళ్తోంది.


టాలీవుడ్ నుంచి ‘మిరాయ్’ (11 నామినేషన్లు) తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 10 నామినేషన్లతో రెండవ స్థానంలో నిలిచింది. వీటితో పాటు అక్కినేని నాగచైతన్య ‘తండేల్’ (Thandel) చిత్రం 9 నామినేషన్లు, కోర్టు రూమ్ డ్రామాగా వచ్చి మెప్పించిన ‘కోర్ట్’ (Court: State vs A Nobody) చిత్రం 9 నామినేషన్లు సాధించి తమ ఆధిక్యాన్ని చాటుకున్నాయి. అద్భుతమైన కథలతో వచ్చిన ఈ నాలుగు తెలుగు చిత్రాలు వేర్వేరు విభాగాల్లో భారీగా పోటీ పడుతుండటంతో, ఈసారి సైమా అవార్డుల విజేతలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరి.. వీటిలో విజేతలుగా ఏ చిత్రాలు నిలుస్తాయో.. ఎవరెవరికి అవార్డులు వరిస్తాయో. ఇదిలాా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 10 నామినేషన్స్‌లో ఉండటంతో, ఆ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మాతలు ఎక్స్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్

యంగ్ టైగర్ వదిలిన ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే..

‘రామాయణ’లో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం

Updated Date - Jul 30 , 2026 | 09:30 PM