సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ద ప్యారడైజ్’.. సంపూర్ణేష్ బాబుకు ఘోర అవమానం

ABN, Publish Date - Sep 23 , 2026 | 11:02 PM

‘హృదయ కాలేయం’ చిత్రంతో టాలీవుడ్‌లో బర్నింగ్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సంపూర్ణేష్ బాబుకు ఘోర అవమానం ఎదురైంది.

Sampoornesh Babu The Paradise

సోషల్ మీడియాలో విభిన్నమైన కాన్సెప్టులతో గుర్తింపు తెచ్చుకుని, ‘హృదయ కాలేయం’ చిత్రంతో టాలీవుడ్‌లో బర్నింగ్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu). తాజాగా ఈ బర్నింగ్ స్టార్‌ (Burning)కు ఓ ఇంటర్వ్యూలో ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సంపూ.. తను నటించిన ‘ద ప్యారడైజ్’ (The Paradise) ప్రమోషన్స్ నిమిత్తం.. ప్రమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చేదు అనుభవం ఎదురైంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా సినిమాలు చేసుకుంటున్న సంపూను ఒక ఇంటర్వ్యూయర్ వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడిన వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. సదరు యాంకర్ సంపూర్ణేష్ బాబును ఉద్దేశించి అవమానకర రీతిలో ప్రశ్నలు సంధించారు. ‘‘సంపూర్ణేష్.. అసలు నువ్వు ఏ యాంగిల్‌లో హీరోవి అయ్యావ్? మీ ఫ్యామిలీలో గానీ, బంధువుల్లో గానీ ఎవరైనా సినిమాలో ఉన్నారా? ఎవరూ లేరు కదా.. మరి నీకెందుకు ఈ దురద? కనీసం నిన్ను పిల్లి మొహం కూడా చూడదు.. అసలు నిన్నెవరు చూస్తారు?’’ అంటూ అత్యంత చులకనగా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఎదురుగా కూర్చున్న సంపూర్ణేష్ బాబు ఆ అవమానకర మాటలను భరిస్తూ నిస్సహాయంగా, బాధతో మౌనంగా ఉండిపోయిన దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి.


ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు, సినీ ప్రియులు సదరు యాంకర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇంటర్వ్యూకి పిలిచి మరీ ఇలా పర్సనల్‌గా ఇన్సల్ట్ చేయడం ఏంటి?’, ‘పాపం రా సంపూ అన్నా.. ఒక నటుడిగా, ఒక మనిషిగా ఆయనకు కనీస గౌరవం ఇవ్వాలి’ అంటూ నెటిజన్లు సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. సినిమా ప్రమోషన్ల పేరిట లేదా వ్యూస్ కోసమే ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నారా? అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పైకొచ్చిన ఒక నటుడిని ఇలా బహిరంగంగా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడటం క్షమార్హం కాని విషయమని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

నన్ను చంపేందుకు కుట్ర.. ఫిర్యాదులో సుమలత పేర్కొన్న అంశాలివే!

‘మండాడి’.. మొన్న రజనీకాంత్.. ఇప్పుడు యూనివర్సల్ హీరో

‘మిస్ కాళికా మిస్సింగ్’.. ఎంత వరకు వచ్చిందంటే

Updated Date - Sep 23 , 2026 | 11:02 PM