‘మిస్ కాళికా మిస్సింగ్’.. ఎంత వరకు వచ్చిందంటే

ABN , Publish Date - Sep 23 , 2026 | 09:47 PM

జెఎస్‌వివి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘మిస్ కాళికా మిస్సింగ్’. తాజాగా ఈ చిత్ర అప్డేట్‌ని మేకర్స్ తెలిపారు.

Miss Kalika Missing Stills

జెఎస్‌వివి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘మిస్ కాళికా మిస్సింగ్’ (Miss Kalika Missing). సత్య ధనేకుల (Satya Dhanekula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు రామకృష్ణ, పదిమల యమున కలిసి నిర్మిస్తున్నారు. వినీత్ చంద్ర (Vineeth Chandra), డాలీషా (Dolisha) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్తేర్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, ఆలీ, జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రామకృష్ణ, యమున మాట్లాడుతూ ప్రాజెక్ట్ విశేషాలను పంచుకున్నారు. ‘‘ఇది ఆద్యంతం ఉత్కంఠభరితంగా, పూర్తి సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే సరికొత్త ఎంటర్‌టైనర్. ఇప్పటివరకు వెండితెరపై ఎవరూ చూడని సరికొత్త స్క్రీన్‌ప్లే, కథనంతో దర్శకుడు సత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడినీ కట్టిపడేసేలా ఉంటాయి. కథకు తగ్గట్టుగా వచ్చిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి శ్రోతల నుంచి మంచి మార్కులు కొట్టేస్తాయి’’ అని ధీమా వ్యక్తం చేశారు.


అన్ని హంగులతో ముస్తాబైన ఈ చిత్రాన్ని దసరా పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ నెలలోనే గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. వినోదంతో పాటు ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. అతి త్వరలోనే చిత్ర ట్రైలర్, అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

సరికొత్త రికార్డులు సృష్టించాలి.. నాని ‘ద ప్యారడైజ్’కు మెగా ఆశీస్సులు

‘ద ప్యారడైజ్’ విడుదల వేళ.. నాని వైఫ్ ఎమోషనల్ పోస్ట్

ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉద్రిక్తత.. జానీ మాస్టర్ భార్య పై దాడి

Updated Date - Sep 23 , 2026 | 09:47 PM