‘మండాడి’.. మొన్న రజనీకాంత్.. ఇప్పుడు యూనివర్సల్ హీరో
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:29 PM
వైవిధ్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ‘మండాడి’ చిత్రం. ఈ చిత్రానికి ప్రముఖులు ప్రశంసలు అందుతున్నాయి.
వైవిధ్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ‘మండాడి’ (Mandaadi) చిత్రం. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సూరి (Soori), సుహాస్ (Suhas) ప్రధాన పాత్రల్లో నటించగా మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా సెప్టెంబర్ 10న విడుదలైన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరి వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
ఈ చిత్రం సాధిస్తున్న ఘన విజయాన్ని పురస్కరించుకుని సినీ దిగ్గజాలు టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) చిత్రయూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించగా, తాజాగా లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Universal Hero Kamal Haasan) ‘మండాడి’ టీమ్‌ను స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. చిత్ర దర్శకుడు, నిర్మాతలతో పాటు నటులు సూరి, సుహాస్, రవీంద్ర విజయ్‌లను ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడిన కమల్, సినిమాలో వారి అద్భుత పనితీరును మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా నటుడు సూరి స్పందిస్తూ.. ‘‘నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. మా టీమ్‌పై కమల్ హాసన్ సర్ చూపించిన ప్రేమ, అందించిన ఆశీస్సులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ కలయికకు కారణమైన మహేంద్రన్ అన్నకు, డిస్నీ బ్రదర్‌కు ధన్యవాదాలు’’ అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
సినిమా విజయానికి కథిర్ అందించిన కెమెరా పనితనం, జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చిన నేపథ్య సంగీతం వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా థ్రిల్లింగ్ బోట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ రేసింగ్ ఎపిసోడ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ ఘట్టాలు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేశాయి. వీటన్నింటికీ తోడు సుహాస్, సూరి తమ సహజసిద్ధ నటనతో పాత్రలకు ప్రాణం పోయడంతో ‘మండాడి’ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
ఇవి కూడా చదవండి:
‘మిస్ కాళికా మిస్సింగ్’.. ఎంత వరకు వచ్చిందంటే
సరికొత్త రికార్డులు సృష్టించాలి.. నాని ‘ద ప్యారడైజ్’కు మెగా ఆశీస్సులు
‘ద ప్యారడైజ్’ విడుదల వేళ.. నాని వైఫ్ ఎమోషనల్ పోస్ట్