నెల గ్యాప్ లోనే.. మెగా మేనల్లుడి ఎంగేజ్‌మెంట్, పెళ్లి.. డేట్స్ ఫిక్స్

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:54 PM

మెగా అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. మెగా కాంపౌండ్‌లో త్వరలోనే పెళ్లి సందడి షురూ కానుంది. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నారు.

Sai Durgha Tej Marriage

మెగా అభిమానులకు (Mega Fans) అదిరిపోయే తీపి కబురు అందింది. మెగా కాంపౌండ్‌లో త్వరలోనే పెళ్లి సందడి షురూ కానుంది. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) ఓ ఇంటివాడు కాబోతున్నారు. గత కొంతకాలంగా ఆయన పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండగా.. తాజాగా ఈ మెగా మేనల్లుడి ఎంగేజ్‌మెంట్ (Sai Durgha Tej Engagement), వివాహ ముహూర్తాలకు సంబంధించిన సమాచారం (Sai Durgha Tej Marriage Date) బయటకు వచ్చి సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


సాయి దుర్గా తేజ్ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ 5న ఆయన నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ సభ్యులు, ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక చాలా ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం.


ఇక నిశ్చితార్థం ముగిసిన నెల రోజుల వ్యవధిలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు తేజ్. డిసెంబర్ 10న హైదరాబాద్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే తనకు కాబోయే భార్య ఎవరు? ఆమె వివరాలేంటి? అనేది మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. మెగా మేనల్లుడి వివాహ తేదీలు బయటకు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వధువు వివరాలతో పాటు వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ మెగా మేనల్లుడు చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన వారా? లేదంటే బయటి వారా అనే దానిపై రకరకాలుగా వార్తలు వినిపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, గతంలో ఓ హీరోయిన్‌తో తేజ్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

RC17: పోస్టర్ చూసి.. ఆ సినిమాతో పోల్చుతున్నారేంటి? రీమేక్ కాదు కదా..

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్.. లీక్ చేసిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్

శింబు - నయన్.. పదేశ్ల తర్వాత మళ్లీ కలవబోతోన్న క్రేజీ జోడీ?

Updated Date - Nov 02 , 2026 | 04:59 PM

Sai Durga Tej Gift: ఆయనలో చిన్నపిల్లాడికి ఈ గిఫ్ట్‌!

Sai Durgha Tej: మేనమామల దారిలో సాయి దుర్గ తేజ్.. తగ్గేదేలే

Sai Durgha Tej: మేనమామ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చేశాయ్

Sai Durga Tej: చిన్నారుల భద్రతపై సంచలన పోస్ట్‌

Sai Durgha Tej: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన హీరో సాయి దుర్గ తేజ్‌.. విషయమిదే!