ట్విన్స్‌తో జన్మాష్టమి.. ఉపాసన షేర్ చేసిన పిక్ వైరల్
ABN, Publish Date - Sep 04 , 2026 | 11:08 AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులు కృష్ణాష్టమి పర్వదినాన్ని తమ పిల్లలతో కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) దంపతులు కృష్ణాష్టమి పర్వదినాన్ని (Happy Janmashtami) తమ ఇంట్లో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తమ పూజా మందిరంలో దైవ సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకలకు సంబంధించిన ఒక ఫోటోని తాజాగా ఉపాసన తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మెగా అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటోతో పాటు ఉపాసన రాసుకొచ్చిన క్యాప్షన్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ‘‘నా కల నెరవేరింది.. నిజంగా ఎంతో అదృష్టవంతురాలిని.. ఓం నమో భగవతే వాసుదేవాయ’’ అంటూ.. ఆమె కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పిక్‌ని గమనిస్తే.. సంప్రదాయ దుస్తుల్లో రామ్ చరణ్, ఉపాసన దైవ సన్నిధిలో కూర్చోగా.. తమ చిన్నారులు క్లీంకార (Klin Kaara)తో పాటు శివరామ్ (Shivram), అన్వీరా దేవి (Anveera Devi)లను బుల్లి కృష్ణుడు, రాధారాణిల వేషధారణలో ముస్తాబు చేసి పూజలో భాగం చేశారు. పిల్లలతో కలిసి ఇలా దైవాన్ని ఆరాధించడం తన చిరకాల కోరిక అని, అది నెరవేరినందుకు భగవంతుడి ఆశీస్సులు సంపూర్ణంగా లభించాయని ఉపాసన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉపాసన పెట్టిన ఈ డివోషనల్, ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో అభిమానుల లైకులు, కామెంట్లతో వైరల్ అవుతోంది. వెనుక నుంచి తీసిన ఈ అందమైన ఫ్రేమ్‌లో పిల్లల ముచ్చటైన రూపాలు, అందంగా అలంకరించిన పూజా గది వాతావరణం పండుగ కళను మరింత పెంచాయి. ప్రస్తుతం ఈ పిక్ చూసిన నెటిజన్లు ‘దిష్టి తగలకూడదు.. లిటిల్ కృష్ణ అండ్ రాధా చాలా క్యూట్‌గా ఉన్నారు’ అంటూ ప్రేమపూర్వక కామెంట్లతో అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సినిమా రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చరణ్, సుక్కు మూవీకి ముహూర్తం ఖరారు
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘ఏషనాగుల’ సాంగ్