సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిన్న పట్టణాలకూ పీవీఆర్ ఐనాక్స్.. ఇక సింగిల్ స్క్రీన్ల కాలం చెల్లినట్టేనా

ABN, Publish Date - Aug 05 , 2026 | 07:47 PM

ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్‌ థియేటర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మరింత కష్టకాలం రాబోతోంది.

PVR INOX small town expansion

ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్‌ థియేటర్ల (Single Screen Theaters) పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనీస నిర్వహణ ఖర్చులు కూడా రాక, ప్రేక్షకులు థియేటర్లకు రాక, అనేక సింగిల్ స్క్రీన్‌లను మూసివేయడం లేదా కళ్యాణ మంటపాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లుగా మార్చడం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ మధ్య ఈ సింగిల్ స్క్రీన్ల వ్యవహారంపై ఇండస్ట్రీలో పెద్ద కాంట్రవర్సీనే నడిచింది. ఇలాంటి క్లిష్ట సమయంలో పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) సంస్థ తీసుకున్న నిర్ణయం సింగిల్ స్క్రీన్ల మనుగడను మరింత ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటి వరకు మెట్రో నగరాలకే పరిమితమైన పీవీఆర్ ఐనాక్స్, రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 300 ఇతర పట్టణాలకు కూడా విస్తరించాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 190 కంటే తక్కువ టికెట్ ధరకు దాదాపు 1000 అఫోర్డబుల్ స్మార్ట్ సినిమా హాల్స్‌ (ఏడాదికి 200 చొప్పున) అందుబాటులోకి తెచ్చేందుకు పీవీఆర్ ఐనాక్స్ సిద్ధమవుతోంది.


ఈ మల్టీప్లెక్స్ థియేటర్లు కనుక చిన్న చిన్న పట్టణాల్లో అందుబాటులోకి వస్తే.. ఇప్పటికే కుదేలైన సింగిల్ స్క్రీన్స్ రోజులు పూర్తిగా చెల్లిపోయినట్లే అనేలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, దాదాపు సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధరలకే క్లీన్ ఎన్విరాన్‌మెంట్, మెరుగైన ఏసీ, సౌకర్యవంతమైన సీటింగ్, మల్టీప్లెక్స్ అనుభూతి లభిస్తే ప్రేక్షకులు సహజంగానే పీవీఆర్ వైపే మొగ్గుచూపుతారు. ఇది నిస్సందేహంగా సింగిల్ స్క్రీన్స్ మనుగడకు పెద్ద ముప్పుగా మారే అవకాశముంది.


అయితే ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. సాధారణంగానే పీవీఆర్ మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్లు చాలా చిన్నవిగా ఉంటాయనే టాక్ ఉంది. ఇక చిన్న పట్టణాలకు విస్తరిస్తే, అక్కడ 2K ప్రొజెక్టర్లు, హోమ్ థియేటర్ సైజు స్క్రీన్లే పెట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు మాస్ ప్రేక్షకులు పెద్ద స్క్రీన్లు, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న సింగిల్ స్క్రీన్స్‌కే ఓటు వేస్తారు. దీనికితోడు చిన్న పట్టణాలలో నివసించే మధ్యతరగతి ప్రజలు టికెట్ ధరల కంటే తినుబండారాల ధరల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. నగరాల తరహాలోనే చిన్న పట్టణాల్లోనూ ఓవర్ ప్రైస్డ్ పాప్‌కార్న్‌లు విక్రయిస్తే పీవీఆర్ ప్లాన్ వర్కవుట్ కావడం కష్టమే. మొత్తంగా చూస్తే.. పీవీఆర్ ఐనాక్స్ కనుక స్మార్ట్‌గా ప్లాన్ చేసి పాప్‌కార్న్ ధరలు తగ్గించి వస్తే మాత్రం.. అది సింగిల్ స్క్రీన్స్ వినాశనానికి దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం మరి.. పీవీఆర్ ఐనాక్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందో..

ఇవి కూడా చదవండి:

మేఘన మిస్సింగ్.. డైరెక్టర్ వి.వి.వినాయక్ ఏం చేశారంటే

మహేష్ బాబు బర్త్‌డే‌కి రాజమౌళి ఇచ్చే ట్రీట్ ఏంటి? ఇప్పుడిదే ట్రెండింగ్

ప్రీతి జింటాతో డేటింగ్‌.. క్రికెటర్ బ్రెట్‌ లీ షాకింగ్ కామెంట్స్

Updated Date - Aug 05 , 2026 | 08:10 PM