ప్రశ్నించే గొంతుకలపై కేసులా.. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు!

ABN , Publish Date - May 23 , 2026 | 04:21 PM

ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనుకునే వారు రాజకీయ గుండాలంటూ నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

K Nageshwar and Prakash Raj

ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనుకునే వారు రాజకీయ గుండాలంటూ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ (K. Nageshwar) ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై కొన్ని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో ప్రొఫెసర్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, నమోదైన పోలీసు కేసులపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌కు ఆయన మద్దతు తెలిపారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ విడుదల చేసిన వీడియోలో..


‘‘ప్రొఫెసర్ నాగేశ్వర్.. సంవత్సరాలుగా అధికారంలో ఉన్నవారినైనా, ప్రతిపక్షంలో ఉన్నవారినైనా ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి, అందులో ఒక లైన్‌ను మాత్రమే పట్టుకుని.. సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు.. ఏంటివి? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఆ ఒక్క మాట తప్పు అనిపిస్తే.. దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం.. ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి?


నాగేశ్వర్.. ఇంతకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, కేసీఆర్, జగన్, రేవంత్ రెడ్డి.. వంటి వారందరినీ ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నలు అడిగారు.. అప్పుడంతా నిజాలు మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడటం ప్రమాదకరం. ఈ రోజు నాగేశ్వర్.. రేపు ఇంకెవరో! ఇంకో విషయం.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు ఎవరి పొత్తులో ఉన్నారనేది అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్.. స్టాప్ దిస్ నాన్సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్! నాగేశ్వర్.. మీకు అండగా మేమున్నాం. కీప్ అప్ ది గుడ్ వర్క్!’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

Updated Date - May 23 , 2026 | 04:21 PM

Prakash Raj Vs Pawan: పవన్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్‌

Prakash Raj: కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి

Prakash Raj - National Awards : గర్వించాల్సిన సమయంలో ఇండస్ట్రీ ఎందుకు కలిసిరావడం లేదు.. అదే నా బాధ! 

Prakash Raj: గుడికెళ్లిన ప్రకాష్ రాజ్.. ఫ్యాన్స్ ఫైర్

Prakash Raj: కోట శ్రీనివాస రావు.. అందరికీ నచ్చడు