తెలుగు సినిమా చరిత్రకారుడు పాటిబండ్ల దక్షిణామూర్తి కన్నుమూత
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:41 PM
తెనాలికి చెందిన సీనియర్ డాక్టర్, తెలుగు సినిమా చరిత్రకారుడు, రచయిత పాటిబండ్ల దక్షిణామూర్తి (89) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కళా, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెనాలికి చెందిన 'ప్రజల డాక్టర్' పాటిబండ్ల దక్షిణామూర్తి (89) మంగళవారం ఉదయం కన్నుమూశారు. విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారని, బుధవారం తెనాలిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమా చరిత్రకారుడు, రచయిత, కళాభిమాని దక్షిణామూర్తి మృతి పట్ల స్థానిక కళ, రాజకీయ రంగానికి చెందిన పలువురు సంతాపం తెలిపారు.
తెలుగు సినిమా చరిత్రను దక్షిణామూర్తి దశాబ్దాలుగా అధ్యయనం చేస్తూ వచ్చారు. గూడవల్లి రామబ్రహ్మం, బి.ఎన్. రెడ్డి, భానుమతి దక్షిణామూర్తి పుస్తకాలను వెలువరించారు. అలానే సినిమా రంగానికి చెందిన అలనాటి ప్రముఖులపై వందలాది వ్యాసాలు రచించారు. పలు సినిమా పుస్తకాలను సమీక్షించారు. సినిమా రంగానికి చెందిన ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఆయన హాజరవుతూ ఉండేవారు. 1973లో క్లాసికల్ ఫిల్మ్ సొసైటీని తెనాలిలో స్థాపించి, ఉత్తమ దర్శక, రచయితలను సత్కరిస్తుండేవారు. వైద్యవృత్తిలో ఉన్న ఆయన ఆ రంగానికి చెందిన పలు పుస్తకాలను రాశారు. దక్షిణామూర్తి మరణం సినిమా జర్నలిస్టులకు తీరని లోటు అని సీనియర్ పాత్రికేయులు పలువురు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Alias Rukmini: రుక్కు రుక్కు రుక్మిణి.. కిట్టయ్యకి నువ్వే అలివేణి
Scene: సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్..
బాత్రూమ్‌లో జారి పడి.. పైకి లేవ లేని స్థితిలో ఒంటరిగా షావుకారు జానకి కుమార్తె!