దూకుడు పెంచిన ధ‌నుష్‌.. మహిళా విభాగంతో భేటీ

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:57 PM

హీరో ధనుష్ కొత్త పార్టీ ప్రారంభించనున్నారనే ప్రచారం నేపథ్యంలో మహిళా విభాగం సభ్యులతో సమావేశమయ్యారు.

Dhanush

ప్రముఖ హీరో ధనుష్ (Dhanush) 'తమిళగ ఎళుచ్చి కళగం (Tamilaga Ezhuchi Kazhagam) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారని వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఆయన మహిళా విభాగం నేతలతో సమావేశమై దీపావళి కానుకగా వెండి దీపాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సొంత పార్టీ ప్రారంభించబోతున్న ధనుష్ తన అభిమాన సంఘాలను బలోపేతం చేయనున్నారు. 'ధనుష్ ఛారిటీ మూవ్ మెంట్ (Dhanush Charity Movement) గా అభిమానుల సంఘాలు రూపాంతరం చెంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా పనిచేస్తున్నాయి.

తొలిదశలో కోయంబత్తూరు జిల్లాలోని గౌండంపాళయం నియోజక వర్గానికి కొత్త నాయకులను నియమించారు. ఈ నేపథ్యంలో ధనుష్ ఛారిటీ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో పాత మహాబలిపురం రోడ్డు సెమ్మెంజేరిలోని ప్రైవేటు కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దాదాపు 5వేల మందికి పైగా మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు మహిళా సమావేశానికి వచ్చిన వారికి చికెన్ బిర్యానీతో విందు ఏర్పాటు చేశారు.

సమావేశంలో ధనుష్ కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. 'మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది, దీపావళి శుభాకాంక్షలు' అని తెలిపారు.. ఈ కార్యక్రమానికి ధనుష్ ధోవతి, తెల్లచొక్కా ధరించి హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళలను ఉత్సాహ పరుస్తూ ధనుష్ ఓ పాట కూడా పాడారు. చివరగా కార్యవర్గ సభ్యులకు వెండి కామాక్షి దీపాన్ని బహుమతిగా అందజేసి జాగ్రత్తగా ఇంటికెళ్లాలని సూచించారు.

Updated Date - Oct 26 , 2026 | 07:15 PM