Deekshith Shetty: కన్నడ ఇండస్ట్రీని మర్చిపోయావా? ర‌ష్మికపై ఫైర్!

ABN , Publish Date - Oct 27 , 2026 | 09:47 AM

ఇతర భాషల్లో ఎదిగినా కన్నడ ఇండస్ట్రీని, తన మూలాలను మర్చిపోవద్దంటూ ర‌ష్మికపై ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

vijay deverakonda, rashmika

ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ (vijay deverakonda), ర‌ష్మిక (rashmika mandanna) జంట‌గా న‌టించిన ర‌ణ‌బాలి (Ranabaali) చిత్రం థియేట‌ర్ల వ‌ద్ద విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. విడుద‌లైన అన్ని ప్రాంతాల‌లో (ఓవ‌ర్సీస్‌ మిన‌హా) బ్రేక్ ఈవ‌న్ సాధించి లాభ‌ల బాట‌లోకి వ‌చ్చిన‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ సైతం ప్ర‌క‌టించారు. అయితే.. వారు ఈ స‌క్సెస్‌ను ఈ కొత్త జంట‌ ఎంజాయ్ చేసే స‌మ‌యంలో తాజాగా జ‌రిగిన ప‌లు ఘ‌ట‌న‌లు ఇటు సామాజిక మాధ్య‌మాల‌ను అటు వారిరువురికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో వారే స్వ‌యంగా రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితి అత్య‌వ‌స‌ర‌మైంది. అస‌లు విష‌యానికి వ‌స్తే..

ఇటీవ‌ల కాఫీ విత్ కరణ్ టాక్ షొ (koffee with karan)లో విజయ్ దేవరకొండ, రష్మికలు తమ ప్రేమ, పెళ్లి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విషయాలను బయటపెట్టారు. రష్మిక పెళ్లి చేసుకోమని వందసార్లు అడిగిందని విజయ్ చెప్పగా.. ఏడాది మొత్తం తనకు ప్రపోజ్ చేశానని రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో విజయ్ రెడ్ ఫ్లాగ్ అంటూ ట్రోలింగ్ నడిచింది. ఆ తరువాత వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒక‌రినొక‌రు ఫాలో కాకపోవడంతో విడాకులు తీసుకుంటున్నారు అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో దేశ వ్యాప్తంగా ఒక్క‌సారిగా చ‌ర్చ‌నీయాంశం అయింది. అంతేగాక ఇరువురిపై ట్రోలింగ్ పైకూడా శృతి మించు పోతుండ‌డంతో విరోష్ జంట హుందాగా స్పందించారు. మేము మా లైఫ్‌లో బాగానే ఉన్నామని మా గురించి బెంగ ప‌డాల్సిందేమీ లేద‌ని మాకు ఒక‌రిపై ఒక‌రికి చెప్ప‌లేనంత ప్రేమ ఉంద‌ని మేము హ్యాపీగా త‌మ లైఫ్ లీడ్ చేస్తున్నామ‌ని ద‌య‌చేసి సోష‌ల్‌ మీడియా పోస్టుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ఆపై త‌మ‌పై ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రుగుతున్న నెగిటివ్ ప్ర‌చారంపై సైబర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్రయించారు.

ds.PNG

ఈ క్ర‌మంలోనే ఇదిలాఉండ‌గానే ఓ క‌ర్ణాట‌క నెటిజన్ ర‌ష్మిక మంద‌న్న‌పై ఫైర్ అయ్యాడు. ఈ మేర‌కు ఓ సుదీర్ఘ పోస్టు పెట్టి విమ‌ర్శ‌లు చేశాడు. క‌న్న‌డ‌లో కెరీర్ స్టార్ట్ చేసి తెలుగుతో గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన వారు తన మూలాలను మాత్రం మర్చిపోకూడదంటూ వ్రాసుకొచ్చాడు. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు ఆ తర్వాత మంచి గుర్తింపు వచ్చిందని నెటిజన్ గుర్తు చేశారు. కన్నడిగులు ఆమెను ఆదరించారని, ఆమె ఎదుగుదలను చూసి సంతోషించారని పేర్కొన్నారు. ఇతర భాషల్లో సినిమాలు చేయడం, ఎక్కడైనా స్థిరపడటం, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆమె వ్యక్తిగత విషయాలని అన్నారు. అయితే, తనకు తొలి అవకాశం ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీని మాత్రం మర్చిపోవద్దని సూచించారు.

అయితే గ‌డిచిన ద‌శాబ్ద కాలంగా అమె కన్నడ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే సమయంలో హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని మాత్ర‌మే ప్రస్తావించారని, కన్నడ ఇండస్ట్రీని పక్కన పెట్టినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇతర విషయాలపై విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే తన మూలాలను గుర్తుచేసుకోవడం బావ్యం కాద‌ని అన్నారు. ఆమె ఎక్కడైనా సినిమాలు చేయ‌వ‌చ్చు, నచ్చిన జీవితం గడపవచ్చు కానీ, కూర్గ్‌కు చెందిన కన్నడిగురాలిగా తన మూలాలను గుర్తుంచుకోవాలని సూచించారు. కన్నడ భాషను, అక్కడి సినీ పరిశ్రమను ఆదరించిన ప్రేక్షకులను గౌరవించాలని అన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన కన్నడ ఇండస్ట్రీతోనూ అనుబంధాన్ని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.

అయితే.. ఇంత‌లా వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తి పేరు దీక్షిత్ షెట్టి (Deekshith Shetty) కాగా ఓ ప్ర‌ముఖ క‌న్న‌డ సినిమా న‌టుడి పేరు కూడా అదే అవ‌డంతో అంతా ఆ న‌టుడే ఈ పోస్టు చేశాడ‌ని భావిస్తున్నారు. దాంతో ఆ పోస్టు క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతుంది. పైగా స‌ద‌రు హీరో రీసెంట్‌గా వ‌చ్చిన గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాలో ర‌ష్మిక‌కు జంట‌గా న‌టించ‌డంతో ఈ వార్త‌కు మ‌రింత ప్రాధాన్య‌త చేకూరింది.

Updated Date - Oct 27 , 2026 | 09:56 AM