‘ఆదర్శ కుటుంబం’.. టికెట్ ధరలు పెంపు

ABN , Publish Date - Oct 27 , 2026 | 10:23 AM

వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ సినిమాకు ఏపీలో టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించింది.

Adarsha Kutumbam

వెంక‌టేశ్ (Venkatesh), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) జంట‌గా మాట‌ల మాంత్రికుడు తివిక్ర‌మ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యాక్ష‌న్‌, ఫ్యామిలీ డ్రామా ‘ఆదర్శ కుటుంబం AK47’ (Adarsha Kutumbam AK47) మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ అంత‌టా జోరుగా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నారు. వెంక‌టేశ్, త్రివిక్ర‌మ్ కాంబోలో రెండు నువ్వు నాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రీ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల తర్వాత వ‌స్తున్న చిత్రం అవ‌డంతో స‌ర్వ‌త్రా ఈ మూవీపై అంచ‌నాలు భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే.. ఇప్ప‌టికే ఈ సినిమాకు ఎలాంటి ప్రీమియ‌ర్స్ ఉండ‌వ‌ని తెలుస్తుండ‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాత ఎస్. రాధాకృష్ణ (హారికా అండ్ హాసిని క్రియేషన్స్) విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ అనుమతి ఇచ్చింది.

go.jpeg

అక్టోబర్ 26న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 అదనంగా వసూలు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అంతేగాక‌ రోజుకు ఐదు షోల వరకు పెంచిన టికెట్ ధరలను అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లకు ఈ అనుమతి వర్తించనుంది.

టికెట్ ధరల పెంపునకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సినిమా లైసెన్సింగ్ అధికారులు, పోలీసు కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులు విడుదల చేశారు. సినిమా విడుదలకు ముందే టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించడంతో చిత్ర బృందానికి ఊరట లభించినట్లయింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Updated Date - Oct 27 , 2026 | 10:50 AM